తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు కొత్త ఒడిశా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. వీరిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత కేవీ సింగ్ డియో కాగా, మరొకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రవతి పరిదా.
ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిని భాజపా ఖరారు చేసింది. మోహన్ మాంఝీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాను ఉప ముఖ్య మంత్రులుగా ఖరారు చేసింది. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి మోహన్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.
Odisha : ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 147 మంది సభ్యులున్న అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుని బీజేపీ మెజారిటీ సాధించింది.
Naveen Patnaik: ఒడిశాలో నవీన్ పట్నాయక్కి చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ) దారుణంగా ఓడిపోయింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.
BJP: బీజేపీ చెప్పినట్లుగా ఎన్డీయే కూటమికి ‘‘400’’ సీట్లు రావడం లేదు. చివరకు 300కి దరిదాపుల్లోనే ఆగిపోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంతో ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అనుకున్నంతగా ఫలితాలను సాధించలేదు. గత రెండు పర్యాయాలు 2014, 2019లో మొత్తం 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా గెలుచుకున్న బీజేపీ ఈ సారి మాత్రం ఆ మార్కును చేరుకోలేకపోయింది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ…
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బీజేడీ ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
ఒడిశాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.