Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
- ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం..
- సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీలు బాధ్యతలు..
- తొలిసారిగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం..
- కార్యక్రమానికి పీఎం మోడీ హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Charan Majhi: ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా సహా బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఒడిశాలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా, మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ చరిత్రి సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 78 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేడీ 51 స్థానాలకు పరిమితమైంది.
Read Also: Heart Pain-Acidity: గుండెనొప్పి, ఎసిడిటీ వల్ల ఛాతిలో కలిగే బాధ మధ్య తేడా ఇదే..
Also Read
సీఎంగా మోహన్ మాఝీ, ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిదా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మాఝీకి ప్రధాని నరేంద్రమోడీ పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం ప్రమాణస్వీకారానికి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. అమిత్ షా, నవీన్ పట్నాయక్‌ని సాదరంగా ఆహ్వానించారు.
#WATCH | BJP leader Mohan Charan Majhi takes oath as the Chief Minister of Odisha, in Bhubaneswar. Governor Raghubar Das administers him the oath to office. pic.twitter.com/Xuv1MRsHcq
— ANI (@ANI) June 12, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?