Exit Polls: లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌లో సంచనల ఫలితాలు వెలువడుతున్నాయి. మరోసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ బారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం నాడు తెలిపారు. మంగళవారం నుండి గురువారం మధ్య లక్ష్మీపూర్ బ్లాక్ లో మూడు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఆంత్రాక్స్ అనేది స్పోర్ ఫార్మింగ్ బాక్టీరియం బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల కలిగే వ్యాధి. తాజాగా ఈ వ్యాధి ముగ్గురికి ఆంత్రాక్స్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వారిని చికిత్స కోసం లక్ష్మీపూర్ హాస్పిటల్ లో చేర్చారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం…
ఒడిశాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కెలాలోని హేమ్‌గిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్తాలీ వ్యాలీలో ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే మరణించారు.. వాహనం డ్రైవర్ సహా మరో ఏడుగురికి గాయలయ్యాయి. ఉదయం కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
PM Modi: ఒడిశా అసెంబ్లీతో పాటు అధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ నేతలు బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది.
ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు.
Loksabha Elections : ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ, ఒడిశాలోని పూరీ సీటుకు సంబంధించిన అన్ని స్థానాల్లో ఓటింగ్ సమయంలో ఈవీఎంలు చెడిపోయినట్లు సమాచారం.
Sambit Patra: బీజేపీ నేత సంబిత్ పాత్ర నోరుజారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఒడిశా పూరిలో ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో నిర్వహించారు. దీని తర్వాత మీడియాలో సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఈ పురాతన పట్టణంలో కొలువదీరిన జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని టంగ్ స్లిప్ అయ్యారు.
ఒడిశాలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒడిశా పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యుడికి గాయాలయ్యాయి. గరియాబంద్ జిల్లా చివరిలో ఉన్న కొమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సునాబేడా అభయారణ్యంలో అర్థరాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో క్రాస్ ఫైరింగ్లో సైనికుడి మెడపై కాల్పులు జరిగాయి. దీంతో.. జవాన్ కు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సైనికుడిని…
సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు అని సీఎం నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.