Nude Photo Case: తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ప్రశాంత్ వ్యవహారం సంచలనంగా మారింది. తీగ లాగితే డొంక కదులుతుంది.
సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు పంపి బెదిరింపులకు దిగుతున్నారు. కుకునూర్ పల్లిలో ఆన్ లైన్ యాప్ నుంచి ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ మొత్తం చెల్లించిన ఇంకా నగదు చెల్లించాలని ఫోన్ చేసి లోన్ యాప్ నిర్వహకులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. లేకపోతే న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు.
తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు న్యూడ్ వీడియో కాల్స్ కలకలం రేపిన విషయం మరువక ముందే ఇప్పుడు న్యూడ్ ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో సమస్యలు తొలుగుతాయని, డబ్బులు కురుస్తాయని చెప్పడంతో మహిళలు నమ్మారు. దీంతో వారిని బ్లాక్ మైయిల్ చేసి, నగరానికి తీసుకువచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో సంచలనంగా మారింది.