Nizamabad: నిజామాబాద్ జిల్లా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరి తెగించారు. స్కానింగ్ సెంటర్ కు వచ్చే మహిళలపై వికృత చేష్టలు చేయడం మొదలు పెట్టాడు. స్కానింగ్ కు వచ్చే మహిళలు, యువతుల న్యుడ్ ఫోటోలు, వీడియోలను వారి తెలియకుండా చిత్రీకరించేవాడు. అతని కామానికి పసిగట్టలేని మహిళలు, యువతులు స్కానింగ్ చేస్తున్నాడు అనుకునేవారు. డాక్టర్ స్కానింగ్ రాసాడు.. స్కానింగ్ సెంటర్ కు వెళ్లామా.. తీసుకున్నామా.. వైద్యుడి దగ్గర చెకప్ చేయించుకుని మందులు తీసుకుందామా.. అనే అలోచనలోనే ఉంటారు. అలాంటి వారిని టార్గెట్ చేసి, స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ తన వికృత బుద్దిని చూపించుకున్నాడు. యువతుల, మహిళల న్యూడ్ ఫోటోలు తీసి వారికి చూపించడం మొదలు పెట్టాడు. దీంతో భయంతో మహిళలు అతని వద్దకు వెళ్లేవారిపై తన కామాన్ని తీర్చుకునేవాడు. అలా కొద్దిరోజులుగా తన వ్యవహారం కొనసాగించాడు.
Read also: FSSAI: తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. ఎఫ్ఎఫ్ఎస్ఏఐ హెచ్చరిక..
తన మాట వినకుంటే వారి సోషల్ మీడియా లో వైరల్ గా ఫోటోలు పెట్టి ఇంకా వీడియోలు కూడా వున్నాయంటూ బెదిరించేవాడు. అయితే ఓ మహిళకు ఫోన్ ఇతని వద్దనుంచి ఫోన్ కాల్ వచ్చింది. నీ ఫోన్ చెక్ చేస్కో అంటూ మాట్లాడాడు. తన ఫోన్ చెక్ చేసుకున్న మహిళ షాక్ కు గురైంది. తన న్యూడ్ ఫోటోలు రావడంతో భయాందోళనకు గురైంది. అయితే మళ్లీ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ నుంచి కాల్ రావడంతాను చెప్పినట్లు చేయాలని బెదిరించాడు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని చెప్తే వీడియోలు కూడా బయట పెడతానని చెప్పాడు. అయితే బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారడంతో న్యూడ్ ఫోటో ల చిత్రీకరణ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసు లు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం నిజామాబాద్ లో చర్చకు దారితీసింది. స్కానింగ్ సెంటర్లకు వెళ్లాలంటే మహిళలు, యువతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
FSSAI: తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. ఎఫ్ఎఫ్ఎస్ఏఐ హెచ్చరిక..