Nude photo: మహబూబ్ నగర్ లో న్యూడ్ ఫోటోల కలకలం.. తాంత్రిక పూజలతో లైంగిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nude photos in Mahabubnagar: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు న్యూడ్ వీడియో కాల్స్ కలకలం రేపిన విషయం మరువక ముందే ఇప్పుడు న్యూడ్ ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో సమస్యలు తొలుగుతాయని, డబ్బులు కురుస్తాయని చెప్పడంతో మహిళలు నమ్మారు. దీంతో వారిని బ్లాక్ మైయిల్ చేసి, నగరానికి తీసుకువచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో సంచలనంగా మారింది.
Read also: Dogs Attack: తెలంగాణలో హడలెత్తిస్తున్న కుక్కల దాడులు.. చైతన్యపురిలో ఒకరు, కరీంనగర్‌లో మరొకరు
Also Read
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో న్యూడ్ ఫోటోల కలకలం రేపాయి. సమస్యలు తొలిగిపోయి, ఇంట్లో నోట్ల వర్షం కురుస్తుందని కేటుగాళ్ళు మహిళలను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన అమాయక ఆడవారు నిజంగానే సమస్యలు తొలిగిపోతాయని నమ్మారు. వారి కష్టాలు తొలగిపోయి మంచి జీవనం సాగుతుందని నమ్మడంతో.. వారి నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న తాంత్రికుడు పూజలు చేయాలని నమ్మించాడు. ఫోటోలు ఎందుకు అని అడిగినా పూజలకు అవసరమని నమ్మించాడు. న్యూడ్ ఫోటోలైతే ఇంకా త్వరగా సమస్యలు తొలగిపోతాయని మహిళలను నమ్మించి మహిళలను న్యూడ్ ఫోటోలు తీశాడు. తాంత్రిక పూజలకు ఉపయోగిస్తున్నానని నమ్మించిన హైదరాబాద్ లోని తాంత్రికుడికి పంపించాడు. అంతేకాకుండా.. పూజలపేరుతో పలువురి మహిళల్ని హైదరాబాద్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈవిషయాన్ని ఎవరికి చెప్పకూడదని ఒకవేళ చెబితే ఇప్పటి వరకు చేసిన పూజలు ఫలించవని బెదిరించాడు. దీంతో మహిళలు మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఆశ్రయించడంతో తాంత్రికుడి అసలు గుట్టు రట్టు అయ్యింది. ఈఘాతుకానికి పాల్పడుతున్న ముగ్గురుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈముఠాలో ఇద్దరు పురుషలతో పాటు ఒక మహిళకూడా ఉండటం గమనార్హం. అయితే వీరు మహిళల న్యూడ్ ఫోటోలను హైదరాబాద్ లోని కొందరికి పంపించారా? లేక మరెవరికైనా పంపించారా? వీళ్లు ముగ్గురే ఇలా మహిళలపై తాంత్రిక పూజలని చేస్తున్నారా? వీరితో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wednesday Stotram: విద్య, వివాహం, అభివృద్దికి ఈ స్తోత్ర పారాయణం చేయండి
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?