Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Cm Chandrababu 3

Off The Record : కుప్పంలో చంద్రబాబును మభ్య పెడుతున్నారా?

Published Date :January 5, 2026 , 7:57 pm
By Gogikar Sai Krishna
  • కుప్పంలో చంద్రబాబును మభ్య పెడుతున్నారా?
  • సీఎంకు తెలియకుండా తెర వెనక బాగోతాలు నడుస్తున్నాయా?
  • కొందరు టీడీపీ నాయకులే బాధ్యులన్న ప్రచారం
  • వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు కుప్పంలో బాబు ఉక్కిరి బిక్కిరి
Off The Record : కుప్పంలో చంద్రబాబును మభ్య పెడుతున్నారా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఏపీ సీఎం చంద్రబాబు అతి ముఖ్యమైన ఓ విషయాన్ని మర్చిపోయారా? లేక ఆయన్ని కొందరు మభ్య పెడుతున్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాగా హడావిడి చేసిన ఓ మేటర్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఏమో…. సెటిల్‌ అయిందేమో…. అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఏ విషయంలో బాబు వైఖరి అంతలా చర్చనీయాంశం అవుతోంది? ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా ఏదేదో జరిగిపోతోందా? తెర వెనక సెటిల్‌మెంట్స్‌ జరిగిపోతున్నాయా…? అంటే… ఏమో… అయితే అవుతుండొచ్చు, వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోందన్నది లోకల్‌ వాయిస్‌. పెద్దాయన ఫుల్‌గా నియోజకవర్గం అభివృద్ధి మీద ఫోకస్‌ పెడితే…. దాన్నే అడ్డంపెట్టుకుని కొందరు నాయకులు అడ్డదారిలో కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు బాధ్యులంటూ కొన్ని పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. 1989 నుంచి 2024 వరకు వరుసగా 8సార్లు కుప్పం నుంచి గెలుస్తున్నారు చంద్రబాబు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక… సొంత నియోజకవర్గంలోనే గతంలో ఎన్నడూ లేనంత వత్తిడి ఎదుర్కొన్నారాయన. జడ్ ప్లస్‌ సెక్యూరిటీతో, రాజాలా తిరిగిన అవే రోడ్ల మీద కింద కూర్చుని ధర్నా చేయాల్సి వచ్చింది. బాబును కుప్పంలో ఓడించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…. ఇందుకు సంబంధించిన స్పెషల్‌ టాస్క్‌ తీసుకున్నట్టు కూడా అప్పట్లో చెప్పుకున్నారు. కట్‌ చేస్తే… ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోగా…మరోసారి కుప్పం ఎమ్మెల్యేగానే గెలిచి సీఎం ఛైర్‌లో కూర్చున్నారు చంద్రబాబు. అయితే… అప్పట్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తూ వైసీపీ మీద బాబు చేసిన ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ తెర మీదికి వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బాబు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా… నాటి ఆరోపణల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? నాటి ఆరోపణలే నిజమైతే… చర్యల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? అందుకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఎక్కడ తేడా కొట్టిందన్న ప్రశ్నలు గట్టినానే వినిపిస్తున్నాయి కుప్పం సర్కిల్స్‌లో. ముఖ్యంగా కుప్పంలో మైనింగ్‌ ఎక్కువగా జరుగుతుంటుంది. నియోజకవర్గంలోని కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

ఇక కుప్పం మండలంలోని మల్లనూరు, కూసూరు, ఉర్లవోబనపల్లె, గుడ్లనాయనిపల్లె, కృష్ణదాసనపల్లె లాంటి గ్రామాల పరిధిలో అక్రమ క్వారీయింగ్‌ యథేచ్ఛగా నడుస్తోంద‌ని, అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు రోజుకు 10 కోట్ల రూపాయల విలువ చేసే ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారంటూ ఆరోపించారు చంద్రబాబు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించి మరీ…… వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారాయన. అంతేకాదు… అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు లేఖ రాశారు కూడా. తన ఆరోపణలకు సాక్ష్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వును కూడా జత చేశారు చంద్రబాబు. దీంతో అప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్‌ స్టాక్‌, యంత్రాలను సీజ్ చేసింది కూడా. ఇది ఇక్కడితో ఆగదని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపిస్తానని, పుంగనూరు పుడింగి సంగతి చూస్తానంటూ డైరెక్ట్‌గా పెద్దిరెడ్డికే తనదైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చారు బాబు. అక్కడ సీన్ కట్ చేస్తే…. ఇప్పుడు ప్రభుత్వం మారి, చంద్రబాబు మరోసారి సీఎం అయి ఏడాదిన్నర గడిచింది. గతానికి భిన్నంగా… సొంత నియోజకవర్గం మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు చంద్రబాబు. వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

అంతవరకు బాగానే ఉన్నా… రోజుకు పది కోట్ల రూపాయల అక్రమాలు, సంగతి తేలుస్తానంటూ ఇచ్చిన వార్నింగ్‌ ఏమై పోయాయని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. తమ ప్రభుత్వం వచ్చాక చాలా సార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారని, అయినా… ఎప్పుడూ పాత గ్రానైట్‌ అక్రమాల గురించి ఎందుకు మాట్లాడ్డం లేదన్న అనుమానాలు పెరుగుతున్నాయి స్థానికంగా. ఇక చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని, నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని కూడా గతంలో సవాల్‌ చేశారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి. మేటర్‌ ఆ స్థాయిలో ఉంటే… అసలు ఆ విషమే తెలియదన్నట్టుగా వ్యవహరించడం ఏంటంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు అసహనంగా ఉన్నారట. నాటి గ్రానైట్ అక్రమాల మీద సీరియస్‌గా దృష్టి పెడితే…. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైసీపీ కుప్పం ఇన్ఛార్జ్‌గా ఉన్న భరత్ సహా చాలామంది లోకల్‌ లీడర్స్‌ ఇరుక్కుంటారని, బాబు మాత్రం ఆ ఒక్కటీ తప్ప అన్నిటి గురించి మాట్లాడుతున్నారన్నది స్థానిక టీడీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే… ఇక్కడే సరికొత్త చర్చ కూడా మొదలైంది. గత విషయాలే కాదు, ప్రస్తుతం జరుగుతున్న చాలా వ్యవహారాలు కూడా అధినేత దాకా వెళ్ళకుండా… నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్‌గా ఎమ్మెల్సీతో పాటు ఓ మంత్రి జాగ్రత్త పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానిక టీడీపీ కార్యకర్తలు.

అలా ఎందుకని అంటే… వైసీపీ హయాంలో గ్రానైట్ దందాలు చేసిన వారితో చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే… పాత విషయాలన్నిటినీ బిజీగా ఉన్న పెద్దాయన దృష్టికి తీసుకువెళ్ళడం లేదని చెప్పుకుంటున్నారు. బాబు కుప్పం టూర్‌లో అసలు గ్రానైట్‌ అక్రమాల మాటే వినిపించకుండా వాళ్ళే జాగ్రత్తపడుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ మిలాఖత్‌ కారణంగానే…. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్‌ భరత్ కూడా… నాకేం వినపడలేదు నాకేం కనబడలేదు అన్నట్టుగా ఉంటున్నట్టు ఫ్యాన్‌ వర్గాల్లో కూడా టాక్‌ నడుస్తోంది. పెద్దాయనకు తెలియకుండా ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి మిలాఖత్‌ రాజకీయం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ… కొందరు కుప్పం తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఈసారి సీఎం కుప్పం టూర్‌లో ఎలాగైనా ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నంలో కొందరు నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పొలిటికల్‌ గేమ్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • ntv
  • OTR
  • peddireddy Ramachandra Reddy

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Bandi Sanjay: బీజేపీ తలదించుకునే పని చేయను.. బండి సంజయ్ కంటతడి..

  • Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!

  • Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్

  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

  • LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions