వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని విమర్శించడానికి ఏపీ మంత్రులు ఎక్కువ మంది వెనకాడుతున్నారా? ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… వీళ్ళు దీటుగా కౌంటర్స్ వేయలేకపోతున్నారా? ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళంతా ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళ వెనకడుగు వెనకున్న రీజనేంటి? ఆ విషయమై టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శల వాడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన చేసిన కామెంట్స్…
నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొననున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నేడు సదుంలో ఎంపీ మిధున్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీడీవో ఆఫీసులో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. నేడు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పర్యటించనున్నారు. గావ్…
ఆ నియోజకవర్గంలో కారు వోవర్ లోడ్ అయిందా? పేరుకు అంతా లీడర్సేగానీ….స్టీరింగ్ పట్టుకునే వాళ్ళు కరవయ్యారా? అసలు డ్రైవర్ సీటే ఖాళీ లేనంతగా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? చివరికి వర్గపోరు ఆ మాజీ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా ఈక్వేషన్స్? నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కారు ఓవర్ లోడ్ అయ్యిందట. స్టీరింగ్ మాక్కావాలంటే… మాక్కావాలంటూ పలువురు నేతలు చూపుతున్న ఉత్సాహమే ఇందుకు కారణమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక్కడ కేడర్కంటే లీడర్స్…
అక్కడ ప్రత్యర్థులతో పని లేకుండా టీడీపీలోని రెండు వర్గాలే గుద్దులాటకు దిగుతున్నాయా? సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వ్యవహారం వెళ్ళిందా? పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందా? ఏదా సెగ్మెంట్? ఎవరా ఇద్దరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు? పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదన్నది…
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సన్నివేశాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయా? కొద్దో గొప్పో పసుపు ఫ్లేవర్ తగిలితేనే కాషాయ దళంలో పదవులు దక్కుతున్నాయా? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామంటూ జబ్బలు చరుచుకునేవారికి చివరికి మిగిలేదా వాపులు, కాపడాలేనా? ఏపీ కమలంలో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందా? పార్టీలో అసలేం జరుగుతోంది? నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? కేవలం కాషాయం ఒక్కటే ఉంటే సరిపోదు…. అదనంగా కాస్త పసుపు కలర్‌ని జోడిస్తేనే పదవులు అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాట్లాడుకుంటున్నారట.…
ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం తంటాలు పడుతున్నారా? అందుకే పార్టీని, లోకల్ ఎమ్మెల్యేని ఇరుకున పెడుతూ ఇష్టానికి కామెంట్స్ చేస్తున్నారా? గాంధీభవన్ పట్టించుకోకపోయేసరికి రోజుకోరకమైన సంచలన వ్యాఖ్యలతో అటెన్షన్ తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? పార్టీలో చేరిన కొత్తవాళ్ళని ఉద్దేశించి ఇక్కడేముందని వచ్చారంటూ కామెంట్ చేసిన ఆ కాంగ్రెస్ సీనియర్ ఎవరు? ఆ మాటల వెనక మర్మం అదేనా? జగిత్యాల పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్న రాజకీయాల్ని తన…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారా? సాక్షాత్తు సెక్రటేరియెట్ సాక్షిగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారా? ఆమె చర్యల్ని సొంత పార్టీ నేతలే కొందరు తప్పుపడుతున్నారా? భలే దొరికారంటూ… విపక్షాలు కత్తులు నూరుతున్నాయా? రాష్ట్ర పరిపాలనా సౌధంలో అసలేం జరుగుతోంది? ఏ విషయంలో మీనాక్షి నటరాజన్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది? రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ సచివాలయం. మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాలు, కీలక నిర్ణయాలకు వేదిక. ఇక్కడ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,…
పిఠాపురంలో తమ్ముళ్ళ దూకుడుకు బ్రేకులు పడుతున్నాయా? హై ప్రొఫైల్ సెగ్మెంట్లో పదే పదే సమస్యలు రావడంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందా? పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం పెద్దలు ఆదేశించారా? యవ్వారం శృతిమించకుండా ఏం చేయాలనుకుంటోంది పార్టీ అధిష్టానం? ఓవర్ స్పీడ్‌ని కంట్రోల్ చేసే ప్లాన్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి పెద్దల్లో ఒకరి ఓన్ సెగ్మెంట్ అయినా సరే…. ఇక్కడ మాత్రం టీడీపీ, జనసేన…
ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ.. గులాబీ పార్టీకి తలనొప్పిగా మారారా..? కేసుల్లో పీకల్లోతున ఇరుక్కుపోయి నియోజకవర్గాలను గాలికి వదిలేశారా? మాకు దిక్కెవరు మహాప్రభో… అంటూ కేడర్ మొత్తుకుంటోందా? ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదన్న ప్రచారం నిజమేనా? ఎవరా ఇద్దరు మాజీలు? ఏంటా కేసుల కహానీ? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. పదేళ్లు ఎమ్మెల్యేలుగా హవా నడిపిన నేతలిద్దరూ ప్రస్తుతం కేసులతో ఉక్కిరి…
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు పోటీ చేస్తోంది? సరిపడా బలం లేదు, ఓడిపోతామని ముందే తెలుసు… అయినా వెరవకుండా కాలు దువ్వడానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కాషాయ దళం దగ్గర స్పెషల్ స్కెచ్ ఉందా? ఓ పథకం ప్రకారం మజ్లిస్‌తో తలపడాలనుకుంటోందా? ఏంటా పథకం? ఎలా వర్కౌట్ అవుతుందని భావిస్తోంది కమలం? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎంఐఎం, బీజేపీ బరిలో ఉన్నాయి. ఈ…