సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన శ్రీలంక. దేశవ్యాప్తంగా వివిధ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు పాకిస్తాన్ లో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం. తేలనున్న భవితవ్యం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఈరోజు మత్స్య జయంతి. ఇవాళ్టి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. నేటితో…
హైదరాబాద్ లో ఓ వైద్యుడు హోటల్లో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు పంకజ్ కుమార్ జైన్ కుమార్తె అనుపమ జైన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల నివాసం ఎదురుగా ఉన్న లాండ్ మార్క్ హోటల్ లో వైద్యుడి దుర్మరణం వివాదాస్పదం అవుతోంది. తన కుమార్తె వివాహ విషయమై నగరానికి వచ్చిన ఇండోర్ కు చెందిన వైద్యుడు పవన్ కుమార్ జైన్ (60) బసచేసిన ల్యాండ్ మార్క్ హోటల్లోని…
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించనున్న గుంటూరు రేంజ్ డీఐజీ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ మలిక గర్గ్ అన్నవరం దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన నిత్యాన్నదానం భోజనాల తయారీకి స్టీమ్ బాయిలర్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్…
కరీంనగర్ జిల్లా బీజేపీలో ఇంకా ముసలం తొలిగిపోలేదా? వేములవాడలో కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయా? బీజేపీలో అంతర్గతపోరు తీవ్రస్థాయికి చేరుకుందా? బండి సంజయ్ను వదల బొమ్మాళి అని వెంటాడుతోంది ఎవరు? ఉనికి కాపాడుకొనే పనిలో అసమ్మతి వాదులుకరీంనగర్ జిల్లా బీజేపీలో కొంతకాలంగా బండి సంజయ్, పార్టీలో సీనియర్లుగా చెప్పుకొంటున్నవారి మధ్య వార్ కొనసాగుతోంది. సంజయ్కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలను పార్టీ పెద్దలు సీరియస్గా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసమ్మతి వాదులపై యాక్షన్ వద్దనుకున్నారో ఏమో.. అటు…
అమరావతే ఏపీకి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ బదులిచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అని చెప్పారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తమ దృష్టికి వచ్చిందని.. కనుక ప్రస్తుతం అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. ఛలో విజయవాడకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. విజయవాడ పోలీసుల నిఘా నేత్రంలో వుంది.…
మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది. క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు…
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు.…
తిరుపతి వర్షంతో వణికిపోతోంది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపడంతో ఆధ్యాత్మిక క్షేత్రం అల్లాడిపోతోంది. ఎటు చూసినా వరదలే. జనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. తిరుపతిలోని మ్యూజియం పక్కనే వున్న ఏపీ టూరిజం హోటల్ వెనుక వైపున విరిగి పడ్డాయి కొండచరియలు. గోడకూలి ఇరుక్కుపోయారు వంట మాస్టర్, మరో మహిళ. ఇరువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది. పీలేరు సమీపంలో అగ్రహారం చెరువు పూర్తిగా నిండడంతో చెరువు తెగే ప్రమాదం ఏర్పడింది. దిగువ భాగాన…