మాజీ ఎంపీ మధుయాష్కీ ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో పలు అంశాలు ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కుదిరించలేకపోతున్నాం. వందల కోట్లు వున్న నేతలు వాళ్ళు వేసే ఎంగిలిమెతుకుల కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయింది. రేవంత్ రెడ్డి వచ్చాక రెడ్డి సామాజిక వర్గం వస్తుందని భావించాం. కానీ ఆందోళనకర రీతిలో హుజురాబాద్లో 3వేలకు ఓట్లు పడిపోవడం దారుణం. దీని వల్ల పార్టీలో మనోస్థైర్యం తగ్గింది. క్షణికానందం కోసం కాంగ్రెస్ నేతలు…
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు.…
తిరుపతి వర్షంతో వణికిపోతోంది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపడంతో ఆధ్యాత్మిక క్షేత్రం అల్లాడిపోతోంది. ఎటు చూసినా వరదలే. జనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. తిరుపతిలోని మ్యూజియం పక్కనే వున్న ఏపీ టూరిజం హోటల్ వెనుక వైపున విరిగి పడ్డాయి కొండచరియలు. గోడకూలి ఇరుక్కుపోయారు వంట మాస్టర్, మరో మహిళ. ఇరువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది. పీలేరు సమీపంలో అగ్రహారం చెరువు పూర్తిగా నిండడంతో చెరువు తెగే ప్రమాదం ఏర్పడింది. దిగువ భాగాన…