Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో నామినేటెడ్ చిచ్చు
అక్కడ నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయా? కనీసం ఆ మంట చల్లార్చే దిక్కు లేకుండా పోయిందా? ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న సామాజికవర్గాలను వదిలేసి అగ్రవర్ణాలకే అన్ని పదవులు కట్టబెడుతున్నారన్న అసహనం పార్టీలో పెరిగిపోతోందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇక సోషల్ మీడియా యుద్ధంగా మారుతున్నాయా? ఎక్కడ జరుగుతోందా రచ్చ? అలా ఎందుకు వదిలేశారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంటోంది. నామినేటెడ్ పదవుల ఆశల్లో ఉన్న సీనియర్స్ అవి దక్కక… -
Off The Record : మోడీ హైదరాబాద్ టూర్లో అంతర్గతంగా అదే సందేశం పంపారా?
తెలంగాణ కోసం బీజేపీ సరికొత్త అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోందా? ఇక్కడ కేవలం హిందుత్వ ఫార్ములా ఒక్కటే వర్కౌట్ కాదని అర్థం చేసుకున్నారా? ప్రత్యామ్నాయ వ్యూహాల్ని కూడా సిద్ధం చేసుకునే క్రమంలో మిత్రపక్షాలు టీడీపీ, జనసేన సాయం కూడా తీసుకోబోతోందా? ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్లో జరిగిన పరిణామాలే అందుకు సంకేతమా? ఇంతకీ…. తెలంగాణ విషయమై కాషాయ పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? ఎంత సీరియస్‌గా వర్కౌట్ చేస్తోంది? ఉత్తరాది ఎలక్షన్ ఫార్ములా… దక్షిణాదిలో వర్కౌట్ కాదన్న… -
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
కళ్ళ ముందే కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నా…. ఆ ఉన్నతాధికారికి చీమ కుట్టినట్టు కూడా లేదా? అసలు నాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదని అంటున్నారా? పైగా… ఇది చాలదన్నట్టు… నేను మంచి పని చేస్తున్నా… అంతా నన్ను మెచ్చుకుంటున్నారంటూ తనకు తానే భుజకీర్తులు తగిలించుకుంటున్నారా? నాకు ఆరుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని అంటున్న ఆ ఉన్నతాధికారి ఎవరు? ఏ విషయంలో వాళ్ళు తనను సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు? తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ… ఫణిభూషణరావుపై… -
Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
బీఆర్ఎస్లో సభ్యత్వాల నమోదు ప్రహసనంగా మారబోతోందా? ఆ విషయంలో అధ్యక్షుడు కేసీఆర్ చేసిన సూచనపై కొందరికి అనుమానాలు ఉన్నాయా? ఆయన చెప్పింది కూడా బాగానే ఉందిగానీ…. అంటూ సాగదీసే బ్యాచ్ పెరుగుతోందా? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం విషయంలో భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి? కేసీఆర్ చేసిన కొత్త ప్రతిపాదన ఏంటి? తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్…క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా విలేజ్ లెవల్ నుంచి సీరియస్‌గా సభ్యత్వ… -
Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా…..? ఉండదా..? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనడమేగానీ…. ఆ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావడం లేదు? ప్రతిసారీ ఏదో ఒక ముహూర్తం తెర మీదికి రావడం, ఆ టైం ముగిసిపోగానే…. అయ్యయ్యో అని ఉసూరుమనడం ఎందుకు సర్వసాధారణమైపోయింది? అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్లు? తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలయితే అప్డేట్ అవుతున్నాయి గానీ… పని మాత్రం జరగడం లేదు. ఆశావహులంతా చకోర… -
Off The Record : నిశ్శబ్ద విప్లవమా.. వ్యూహాత్మక విస్తరణా? తెలంగాణలో బీజేపీ దూకుడు
తెలంగాణలో చాపకింద నీరులా కాషాయ అజెండా అమలవుతోందా? హిందూ ఐక్యత దిశగా ఒక పథకం ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయా? అన్నీ కలగలిపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూరే దిశగా అడుగులు పడుతున్నాయా? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? సంఘ్ పరివారం ఏం చేస్తోంది? తెలంగాణ లో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. హిందుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాలను RSS నిర్వహిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్థానం, పంచ పరివర్తనలపై ఈ సమావేశాల్లో… -
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
సొంత పార్టీ అధ్యక్షుడి నియోజకవర్గాన్ని కూడా ఆ ఎంపీ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారా? నమ్మి నానబోసుకుంటే…పుచ్చి బుర్రట్లాడినయ్ అన్న సామెతను గుర్తు చేస్తున్నారా? పదవి ఉంది, ప్రోటోకాల్ ఉంది. పోయి కో ఆర్డినేట్ చేయమంటే… కనీస పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారా? పేరుకే యంగ్గానీ…. ఆయనకి అస్సలు పని చేయాలన్న మూడ్, ఉత్సాహం ఏమీ లేవా? మరీ… దారుణంగా ఉన్నారని జనసైనికులే మాట్లాడుకుంటున్న ఆ ఎంపీ ఎవరు? ఎందుకలా చేస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం… -
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
బెంగాల్లో కమలం విరిశాక… కాషాయ దళం నెక్స్ట్ టార్గెట్ ఏది? బీజేపీ అధిష్టానం తెలంగాణను తన రాడార్ పరిధిలోకి తీసుకురాబోతోందా? అంత క్లిష్ట పరిస్థితులున్న బెంగాల్లోనే గెలవగలిగినప్పుడు అంతో ఇంతో అనుకూలత ఉన్న తెలంగాణలో ఎందుకు గెలవలేమన్న కాన్ఫిడెన్స్ పెరిగిందా? ప్రధాని మోడీ సభతోనే దక్కన్ గడ్డ మీద సమర శంఖం పూరించబోతున్నారా? బెంగాల్ గెలుపు తర్వాత టీజీ బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గిరిగీసి బరిలో నిలిచి… -
Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
ఎన్టీఆర్ జిల్లాలోని ఆ కీలకమైన సామాజికవర్గంపై వైసీపీ ఫోకస్ పెట్టిందా? గత ఎన్నికల్లో ఎక్కడ నష్టం జరిగిందో తొలిసొచ్చిందా? అందుకే బలమైన ఆ ఓట్ బ్యాంక్ ఈసారి చెదిరిపోకుండా ఇప్పట్నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టిందా? ఇంతకీ ఏ కులం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది ఫ్యాన్ అధిష్టానం? డ్యామేజ్‌ని కవర్ చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తోంది? ఎన్టీఆర్ జిల్లాలో, ప్రత్యేకించి బెజవాడ నగరంలో కాపు సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది వైసీపీ. ఆ విషయంలో సీరియస్‌గానే వర్కౌట్ చేస్తున్నట్టు… -
Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
ఆ మాజీ ఎమ్మెల్యేను కారులోనే ఉంచుతారా….? లేక డోర్స్ ఓపెన్ చేసి ఖాళీ లేదు, దిగి వెళ్లి పొమ్మంటారా? పార్టీ అధిష్టానం ఇచ్చిన షో కాజ్ నోటీసులకు ఇంత వరకు ఆయన సమాధానం ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? అదే సమయంలో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం వెనక అర్ధం ఏంటి? ఇంతకు ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా కథ? వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!