మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) హస్పటల్ లో జాయిన్ అయ్యారు. పుణెలోని భారతీ హాస్పిటల్లో బుధవారం నాడు రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
Kishan Reddy: జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో మరో వందే భారత్ ట్రైన్ రానుందని, వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
Malla Reddy: ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ
అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన, నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపోత్సవం నాగసాధువులచే మహా రుద్రాభిషేకం కొనసాగింది. సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన జరిగింది.