Off The Record : రాజీనామా చేశాక రాజాసింగ్ కు అసలు బొమ్మ కనిపించిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్ ఎమ్మెల్యే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా? పాపం రాజాసింగ్ అనే పరిస్థితి వచ్చిందా? ఆవేశం ఆయన కొంప ముంచిందా? తాను రాజీనామా చేసిన బీజేపీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? ఎవరివో రాజకీయ వ్యూహాలకు రాజా బలయ్యారా? క్షవరం అయితేగానీ… వివరం తెలీదన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి మారిపోయిందా? ఓన్లీ… హిందుత్వ అజెండాతో పనిచేస్తూ… రాజకీయంగా ముందుకు పోతున్న లీడర్ రాజాసింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఆ ఫైర్ బ్రాండ్‌కు ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ భయం పట్టుకుందట. తొందరపడి తన కోయిల ముందే కూసిందే అంటూ… తెగ ఫీలైపోతున్నారట. పార్టీగా బీజేపీ తనకు బలమా? లేక బీజేపీని తానే భుజాల మీద మోస్తున్నానా అన్న మీమాంసలో… పాపం… వాస్తవాలు తెలుసుకోకుండా కమలాన్నే తాను మోస్తూ భరిస్తున్నట్టు ఫీలైపోయి.. నా కోడి కూయకుంటే… తెలంగాణ బీజేపీకి తెల్లారదని అనుకుని పార్టీకి రాజీనామా చేసేశారు. కానీ… ఆ తర్వాతగానీ… అయ్యగారికి తత్వం బోధపడలేదట. తాను చేసిన తప్పేంటో… తొందరపాటు నిర్ణయానికి ఫలితం ఏంటో ఐ మ్యాక్స్ రేంజ్‌లో అయ్యగారికి బొమ్మ కనిపించి… ఇప్పుడు తాపీగా ఫీలవుతున్నారట. ఆ క్రమంలోనే… తిరిగి కమలం గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రాజాసింగ్ తాజా స్టేట్‌మెంట్స్ చూస్తుంటే.. ఆ విషయం అర్ధమైపోతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ తరపున మూడు సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజా.
మూడోసారి గెలిచాక… ఇక నాకేంటన్న ఓవర్ కాన్ఫిడెన్సో లేక మరో కారణమో గానీ…. పార్టీకి ఆయనకు మధ్య చాలా పెద్ద గ్యాపే వచ్చింది. రాష్ట్ర నాయకులు కొందరి మీద కోపం పెంచుకున్న ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. తనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇగ్నోర్ చేస్తున్నారని మొదలుపెట్టి… ముఖ్య నాయకుల్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక వర్గం మీద ఆయకున్న అసంతృప్తి, ఆగ్రహాన్ని వాడుకుని మరో వర్గం రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేసిందని, ఆ గేమ్‌లో రాజాసింగ్ పావుగా మారాడన్న అభిప్రాయం సైతం ఒక దశలో బలంగా ఉండే తెలంగాణ బీజేపీలో. అలాంటి రకరకాల కారణాలన్నీ కలగలిసి ఫైనల్‌గా పార్టీకి రాజీనామా చేశారు శాసనసభ్యుడు. కేంద్ర పార్టీ కూడా పెద్ద టైం తీసుకోకుండానే… అయన రాజీనామాను ఆమోదించింది. అలాగే లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలను సైతం తప్పుపట్టింది. కేంద్ర పార్టీ తన విషయంలో సానుకూలత వ్యక్తం చేస్తుందని అనుకున్నారని, చర్చల కోసం పిలిస్తే…. అన్ని అంశాలని అప్పుడే చెప్పాలని అనుకున్నారట. కానీ… రాజాసింగ్‌కు ఆ ఛాన్స్ ఇవ్వకుండా… పార్టీ పెద్దలు రాజీనామా పత్రానికి స్టాంప్ వేసేయడంతో గతుక్కుమన్నట్టు సమాచారం. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం చౌరస్తాలో ఉంది… బీజేపీని కాదని ఎటూ పోలేని పరిస్థితి. అక్కడ తప్ప ఇంకెక్కడా ఇమడలేడన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. పార్టీకి రాజీనామా విషయంలో వెనకా ముందు ఆలోచించని రాజాసింగ్… ఇప్పుడు మాత్రం స్వరం మార్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని పార్టీ చెబితే చేస్తానన్నది ఆయన లేటెస్ట్ వాయిస్. ఒకసారి రిజైన్ చేసేసి, దాన్ని హైకమాండ్ ఆమోదించాక… ఇక పార్టీ నిర్ణయంతో పనేంటన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అక్కడితో ఆగలేదు రాజాసాబ్. గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అడ్డా అని ఇప్పుడు చెబుతున్నారాయన. నేను వేరే ఏ పార్టీలో చేరబోనని కూడా అంటున్నారట. దీన్ని బట్టి చూస్తుంటే… తిరిగి పార్టీలోని వస్తానని సంకేతాలు పంపుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. క్షవరం అయితే గానీ… వివరం తెలీదన్న సామెత మనోడికి సరిగ్గా సరిపోతుందంటూ సెటైర్స్ కూడా వేసుకుంటున్నారట బీజేపీ నాయకులు కొందరు. ఈ తిప్పలకు బదులు… అసలు రాజీనామా ఆమోదం పొందక ముందే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల్ని కలిస్తే పరిస్థితి వేరుగా ఉండేది కదా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. సరే… జరిగిందేదో జరిగిపోయింది. తిరిగి బీజేపీకి జై కొడుతున్నాడు కాబట్టి… ఢిల్లీ నాయకత్వం కరుణిస్తుందో, లేదో చూడాలంటున్నారు. పార్టీకంటే వ్యక్తులు ముఖ్యం కాదన్న సంగతిని ఇప్పటికైనా ఆయన గుర్తిస్తే… బెటర్ అంటున్నారు టీజీ బీజేపీ నాయకులు. రాజకీయాల్లో ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యమన్న సంగతి తెలియకుంటే ఇలాగే ఉంటుంది, పాపం రాజాసింగ్ అన్నది పార్టీ లీడర్స్ వాయిస్.
తాజావార్తలు
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Ampere Magnus G Max: 30కి పైగా కొత్త ఫీచర్లతో అప్డేట్ అయిన Ampere Magnus G Max.. 142km రేంజ్, ధర ఎంతంటే?
-
Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్‌ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
-
Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!