Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Jc Prabhakar Reddy

Off The Record : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చిందులు కామనా..?

Published Date :July 23, 2025 , 8:34 pm
By Gogikar Sai Krishna
Off The Record : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చిందులు కామనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ తీరుతో అధికార పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారా? ఎంతటి అధికారి అయినాసరే… అదేదో తమ ఇంట్లో పాలేరన్నట్టుగా ఛైర్మన్‌ ఫీలైపోతున్నారా? జిల్లా స్థాయి అధికారుల మీదికి సైతం ఒంటికాలి మీద లేస్తూ… బూతు పురాణం అందుకోవడాన్ని ఎలా చూడాలి? ఓవైపు రచ్చ అవుతున్నా… అంతా జనం కోసమేనని ప్రభాకర్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతం? ఓపెన్‌ విత్‌ స్పాట్‌ జేసీ అధికారుల మీద ఫైర్‌ అవుతున్నది ఇదే… ఈ వైఖరే… ఇప్పుడు కేవలం తాడిపత్రి నియోజకవర్గంలోనేగాక రాష్ట్రం మొత్తం హాట్‌ టాపిక్‌ అవుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇలా… స్థాయీ భేదాల్లేకుండా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఒక దశలో బూతు పురాణం విప్పడం లాంటివి చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రకంగా ఇది అధికార పార్టీకి, ప్రభుత్వానికి కూడా తలనొప్పి అవుతోందన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ ఛైర్మన్‌ అవడం, ఆయన కుమారుడు లోకల్‌ ఎమ్మెల్యే కావడంతో… ఈ వ్యవహారాలు అటు సర్కార్‌ మీద కూడా ప్రభావం చూపుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎందుకిలా చిందులేస్తున్నారంటే… దానికి చాలా కారణాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి లోకల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు అధికారుల సహాయ నిరాకరణ ఉంటుందని అంటారు. కానీ… జేసీ మాత్రం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… ఇలా చిటపటలాడుతుంటారని ఒక రేంజ్‌లో విరుచుకు పడుతుంటారన్నది లోకల్‌ వాయిస్‌. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చెప్పినా చేయడం లేదంటూ సాక్షాత్తూ మహిళా కలెక్టర్ మీద అందరి ముందు ఫైర్ అయ్యారు జేసీ. ఆమె టేబుల్ మీదికి ఫైళ్ళు విసిరారు. అప్పట్లో అది పెద్ద వివాదంగా మారింది. ఇక జిల్లా ఎస్పీలు, తాడిపత్రిలో పని చేసిన డీఎస్పీ మీద ఒకానొక సందర్భంలో బూతులతోనే విరుచకపడ్డారాయన. ఇక ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అయ్యాక.. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్‌గా ఎవరు రావాలన్నా వణికి పోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయే వారు. ఛైర్మన్ హోదాలో జేసీ మాట వినాలో లేక అప్పట్లో లోకల్‌ ఎమ్మెల్యే హోదాలో పెద్దారెడ్డి మాట వినాలో తెలియక మున్సిపల్‌ కమిషనర్లు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ తిట్లు భరించలేక ట్రాన్స్‌ఫర్స్‌ చేయించుకున్నారట కొందరు అధికారులు. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పనులు జరగలేదనో లేక తన మాట వినలేదనో ఫ్రస్ట్రేషన్‌ ఉంటే ఉండవచ్చుగానీ…. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.

అయినా సరే.. అధికారుల మీద అదే స్థాయిలో ఫైర్ అవుతుండటం, తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. తాజాగా జిల్లా పంచాయతీ అధికారి, తాడిపత్రి ఏఎస్పీ మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అధికారులను ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాష వాడటంపై అధికార పార్టీ వైపు నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభాకర్‌రెడ్డి. జడ్పీ ఆవరణలోని డీపీఆర్సీలో డీపీవో ఉన్నారని తెలుసుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ నేరుగా అక్కడికి వెళ్లారు. అక్రమ లేఅవుట్లపై జాయింట్‌ కలెక్టర్ చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రియల్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నావా? అంటూ… బూతులు లంకించుకోవడంతో మధ్యలోనే బయటికి వచ్చేశారట డీపీఓ. అక్కడితో ఆగకుండా… నువ్వు అహంకారివి, నీ కథ చూస్తా.. నాకు అంతా తెలుసు.. జాగ్రత్త.. అంటూ పదేపదే హెచ్చరించారట. వీడు ప్రతి వ్యవహారంలో అవినీతి చేశాడు.. అన్ని చోట్ల డబ్బులు తీసుకున్నాడంటూ ఏకవచనాలే వాడేశారు. ఏప్రిల్ నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించలేదని అనడంతో.. బదిలీల కారణంగా తాఖీదులు ఇవ్వడం కొంత ఆలస్యమైందని అధికారి చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదట ప్రభాకర్‌రెడ్డి.

అటు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ మీద కూడా ఇదే స్థాయిలో విరుచకుపడ్డారు జేసీ. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనంతపురం జిల్లాలో ట్రాన్స్‌మిషన్‌ టవర్లు ఏర్పాటు చేస్తోంది. ఆ కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారన్నది జేసీ ఆరోపణ. యాడికిలో టవర్లు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు జేసీ అనుచరులు. దీంతో వాళ్ళ మీద కేసు నమోదైంది. పోలీసులను ముందుపెట్టి పవర్ గ్రిడ్ పనులు జరిపిస్తావా.. కాంట్రాక్టర్ల నుంచి ఎంత అందింది? అంటూ ఫైర్ అయ్యారు ప్రభాకర్‌రెడ్డి. ఆయన విషయంలో కూడా పరుష పదజాలమే వాడేశారు. నువ్వు ఏఎస్పీ అయితే ఏంటి? నీ మీద కూడా కేసు పెడతానంటూ ఎగిరెగిరి పడ్డారు జేసీ. వైసీపీ హయాంలో మాకు జరిగిన అన్యాయానికి నువ్వు సమాధానం చెబుతావా అంటూ మీడియా వేదికగానే దూషణలకు దిగారాయన. ఈ వ్యవహారశైలి గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. జనం కోసం మాట్లాడుతున్నానని జేసీ సమర్ధించుకోవచ్చుగానీ… పని చేయించుకోవడానికి కూడా ఒక పద్ధతంటూ ఉంటుంది కదా… ఉన్నతాధికారులేదో… మీ ఇంట్లో పాలేర్లు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడే ప్రతిపక్షం వైసీపీకి కూడా మంచి అస్త్రం దొరుకుతోందట. అధికారుల మీద ప్రభాకర్‌రెడ్డి విరుచుకుపడ్డ తీరు, ఆయన వాడిన బూతుల వీడియోల్ని వైరల్‌ చేస్తూ… కూటమి సర్కార్‌లో అధికారులకు దక్కుతున్న గౌరవం ఇదీ అంటూ ప్రచారం చేస్తున్నారట. పైగా… ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇవి కనిపించడం లేదా అంటూ నిలదీస్తుండటం కూటమి సర్కార్‌కు ఇబ్బందికరంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు జేసీ మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. నేను రౌడీని కాబట్టే నా ఊరు బాగుందంటూ… లేటెస్ట్‌ ట్విస్ట్‌ ఇచ్చారాయన. తాడిపత్రి ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అనడంతో దీన్ని ఇక్కడితో వదిలే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో… ఆయన ఉద్దేశ్యం మంచిదైతే కావచ్చుగానీ… ప్రతిదాన్ని డీల్‌ చేయడానికో పద్ధతంటూ ఉంటుందికగా అన్నది అధికార వర్గాల మాట. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా సెట్‌ చేస్తుందోనని చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • JC Prabhakar Reddy
  • NTV Telugu
  • off the record

తాజావార్తలు

  • KING : వెయ్యి కోట్లు వసూళ్లపై కన్నేసిన స్టార్ హీరో

  • ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?

  • Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

  • Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

  • Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ట్రెండింగ్‌

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions