Chairman’s Desk: ఒకప్పుడు కార్తీక మాసమంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప.. ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం.. దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం.. సాంస్కృతికంగా, శాస్త్రీయంగా.. వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడమనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు…
అక్కడ ముందు రోజు కనిపించిన కొండ మరుసటి రోజుకు షేప్ మారిపోతోందట. రాత్రికి రాత్రే విచ్చలవిడిగా జరుపుతున్న అక్రమ తవ్వకాలతో కొన్ని కొండలకు బోడి గుండ్లు అవుతుంటే… మరికొన్ని అసలు మాయమైపోతున్నాయి. ఎవరు అలా చేస్తున్నారంటే… అన్ని వేళ్ళు కూటమి ఎమ్మెల్యేల వైపే చూపిస్తున్నాయి. ఏ జిల్లాలో జరుగుతోందా తంతు? ఏ స్థాయిలో ప్రకృతి సంపద లూటీ అవుతోంది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొండలకు బోడిగుండ్లు అవుతున్నాయి. ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గా ఉండే ఎర్రమట్టి కొండల్ని గ్రావెల్…
ఆ మాజీ మంత్రి సోదరుడికి పసుపు వాసన పడలేదా? అందుకే కాషాయం కప్పుకుని మురిసిపోతున్నారా? టీడీపీ ఎమ్మెల్యే బ్రదర్ మిత్రపక్షం బీజేపీలో చేరడాన్ని ఎలా చూడాలి? పాత నియోజకవర్గంలో పట్టు పోతోందని ఆ టీడీపీ ఎమ్మెల్యేనే బ్రదర్‌ని పంపారా? లేక అక్కడున్న పొలిటికల్ వ్యాక్యూమ్‌తో అలా అయిపోయిందా? ఎక్కడ జరిగిందా వ్యవహారం? ఎవరా బ్రదర్స్? మాజీ మంత్రి, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వరుసకు సోదరుడు నారాయణ టీడీపీ కండువా తీసేసి కాషాయమ కప్పుకున్నారు. బీజేపీ…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహాలు రొటీన్‌కు భిన్నంగా ఉన్నాయా? పోల్ మేనేజ్మెంట్లో ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా? గతంలో చూడని, వినని కొన్నిటిని చూడబోతున్నామా? అత్యంత కీలకమైన రాబోయే మూడు రోజుల్లోనే పొలిటికల్ స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కనిపిస్తాయా? ఎలా ఉండబోతున్నాయి ప్రధాన పార్టీల పోల్ ఎత్తుగడలు? ఏంటా సంగతులు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచార ముగింపు గడువు దగ్గర పడుతోంది. దాంతో…ప్రధానరాజకీయ పార్టీలన్నీ తదుపరి అంశం మీద దృష్టి పెడుతున్నాయి. నేతలు…
జూబ్లీహిల్స్‌లో బీజేపీ సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు వెళ్తోందా? అదే అంశం మీద ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోందా? దాని గురించే గట్టిగా చెప్పగలిగితే… ఓ వర్గం ఓట్లు సాలిడ్ అవుతాయని కాషాయ దళం లెక్కలేస్తోందా? ఇంతకీ ఉప ఎన్నిక బరిలో కమలం పార్టీ ప్లాన్ ఏంటి? ఓట్ల వేటలో పార్టీ ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం పొగలు సెగలు పుట్టిస్తోంది. కలిసి వచ్చే ఏ…
మేకప్‌కు ప్యాకప్ చెప్పి….ప్రజాసేవకే క్లాప్ కొడతానన్న ఆర్కే రోజా….మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మొన్నటి వరకు బుల్లితెరకే రీఎంట్రీ ఇచ్చిన రోజా…ఇప్పుడు ఏకంగా వెండితెరపై మళ్లీ మెరుస్తున్నారు. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా సినిమా సీక్వెల్ దేనికి సంకేతం? ఇక పాలిటిక్స్ కన్నా మూవీలే బెటరని ఆమె అనుకుంటున్నారా? క్యాడర్లో కన్ప్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? తెలుగు రాజకీయాల్లో ఆర్కో రోజా అంటే ఫైర్..ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ…
బతికున్నప్పుడు వేధింపులు…మరణం తర్వాతా సాధింపులా? ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గంలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అసలు ఆయన మరణానికీ ఎమ్మెల్యే మెంటల్ టార్చరే కారణమన్న కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఏకంగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినా….సయోధ్య కుదరలేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత ఆగ్రహం….అసహనం? నెల్లూరు రాజకీయాల కథే వేరు. చలికాలంలోనూ చెమటలు పట్టించేలా ఉంటాయి. ఇక్కడి నేతలు ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీలో ఉండే నేతల ఎత్తులకు కూడా పైఎత్తులు వేస్తూ…
జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా....ఇన్నాళ్లు పరోక్షంగా బీఆర్ఎస్ను...ప్రత్యక్షంగా అదే పార్టీ ముఖ్య నేతలను తిట్టిన కవిత...ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి?
ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అటుఇటు మార్చింది వైసీపీ. తమది కాని నియోజకవర్గంలో వున్న నేతలు అన్యమనస్కంగానే వున్నారు. పేరుకు ఇంఛార్జ్ పదవిలో వున్నా…ఎలాంటి ఛార్జింగ్ లేకుండా సైలెంటయ్యారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళనకు సిద్దమయ్యారా? ఎవరూ ఊహించనిరీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారా? ఇంఛార్జ్‌ల మార్పులపై కొందరు నేతల్లో అప్పుడే అలజడి మొదలైందా? ఎన్నికల తర్వాత పార్టీపైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్…ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన…
ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు……