Off The Record : జీవన్ రెడ్డి వ్యవహారశైలి పై కాంగ్రెస్ లో చర్చలు
- జీవన్‌రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్‌లో రకరకాల చర్చలు
- రెండేళ్ళలో రాజీనామాల పేరుతో నాన్నా పులి కథ?
- మొదట్లో కంగారుపడ్డా తర్వాత అధిష్టానం కూడా లైట్
- తాజాగా రాజ్యసభ సీటు ఇస్తారంటూ అనుచరుల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఘనంగా చెప్పుకునే ఆ నేత వ్యవహారశైలి అందుకు తగ్గట్టుగా లేదా? పోతా……. నే బోతా……..నెనెల్లిపోతానంటూ ఛాన్స్ దొరికినప్పుడల్లా క్యాసెట్ రివైండ్ చేస్తూ… నాన్నా పులి కథను గుర్తుకు తెస్తున్నారా? చివరికి కాంగ్రెస్ అధిష్టానం కూడా … ఇది నిజంగా అదే కథని నమ్ముతోందా? ఎవరా నేత? ఏంటా రాజీడ్రామా కథ? తాటిపర్తి జీవన్‌రెడ్డి…..తెలుగు పాలిటిక్స్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. కానీ… ఇప్పుడాయన వ్యవహారశైలితో…. ఆ అనుభవం అంతా ఏమైపోయింది? ఆ సీనియారిటీ మొత్తం ఏ గాలివానకు కొట్టుకుపోయిందన్న చర్చలు కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నాయట. వరుసగా రెండు సార్లు తనను ఓడించిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌కు దగ్గరయ్యాక రగిలిన చిచ్చును రోజుకో పుల్లవేసి ఎగదోస్తున్నారట జీవన్. సొంత పార్టీపై అలిగిఈ రెండేళ్ల కాలంలో రాజీనామా పేరుతో నాన్నా పులి కథను పకడ్బందీగా అమలు చేస్తూ… పదే పదే పార్టీ నాయకత్వం తన వైపు చూసేలా చేసుకుంటున్నారన్నది ఇంటర్నల్ టాక్. దీని గురించి మొదట్లో పరేషాన్ అయిన పార్టీ అధిష్టానం… ఏదో జరిగిపోయేలా ఉందని ఆగమేఘాల మీద దూతలను పంపింది… అయితే లోపలకు వెళ్లగానే సారు వారు సైలెంట్ అయ్యారు. తిరిగి రెండు రోజుల తర్వాత హాట్ హాట్ కామెంట్స్ చేయడం, కార్యకర్తలతో సమావేశం కావడం… ఇక తాడో పేడో అన్నట్టుగా సందేశాలు పంపడం పార్టీలో హైటెన్షన్ క్రియేట్ చేశాయి.
ఇలా… సందర్భం వచ్చిన ప్రతిసారి రిపీట్ చేయడంతో పార్టీ పెద్దలు కూడా లైట్ తీసుకుంటున్నారట. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని జీవన్‌రెడ్డికి ఇస్తున్నారంటూ ప్రచారం స్టార్ట్ చేశారు ఆయన అనుచరులు. సీటు ఇవ్వకుంటే రాజీనామా తప్పదంటూ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారట. ఈ వ్యవహారాలపై గాంధీభవన్ బాగా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న ఎమ్మెల్సీ రెన్యూవల్, మంత్రి పదవి అన్నారు. ఇప్పుడు రాజ్యసభ పాట పాడుతున్నారు. ఏమన్నా అంటే రాజీనామా చేస్తానంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పదవులు అనుభవించి 75 ఏళ్లకు దగ్గర పడుతున్న ఆయనకే ఇంకా పదవుల మీద మోజు పోకపోతే… మిగతా వాళ్ళ సంగతేంటి అంటూ… పార్టీ పెద్దలు కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
సందర్భం వచ్చిన ప్రతిసారి జీవన్ రెడ్డి రాజీనామాను పాశుపతాస్త్రంలా వాడాలని అనుకుంటున్నా చివరికి అది పాచి పదార్ధంలా మారిపోతోందన్న సెటైర్స్ సైతం పడుతున్నాయి పార్టీ వర్గాల నుంచి. గతంలో ఎమ్మెల్సీ రెన్యువల్ నుంచి మొదలుపెడితే… మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల దాకా ప్రతిసారి జీవన్‌రెడ్డి రాజీనామా పాటే పాడటం ఆయన సీనియారిటీకి తగనిదని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ వర్గానికి 20 టికెట్లు దక్కాయి. కానీ… ఆయన మాత్రం వాళ్ళకు ప్రచారం చేయకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు చేశారు. అటు రాయికల్ మున్సిపాలిటీలోనూ ఇదేవైఖరి అనుసరించారాయన. పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్‌లను కూడా ఖాతరు చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు తప్ప అందరికీ ప్రచారం చేశారు. అధిష్టానానికి దీని గురించి చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన రీతిలో చెప్పేశారు. తర్వాత ప్లేట్ ఫిరాయించిన మాజీ మంత్రి… గెలిచిన వాళ్ళతో హైదరాబాద్‌లో బలప్రదర్శనకు ప్రయత్నించినా….మొత్తం మీరే చేశారంటూ మొహం మీదే చెప్పినట్టు తెలిసింది. అలా చెప్పడమే కాకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదించిన వారికే ఇచ్చేశారు. దాంతో… పార్టీ తనను లైట్ తీసుకుంటోందని అర్ధం చేసుకున్న జీవన్‌రెడ్డి ఇంకాస్త టోన్ పెంచే ప్రయత్నం చేశారట. అది వర్కౌట్ అవకపోగా… పార్టీ నుంచి రివర్స్ అటాక్ స్టార్టయినట్టు తెలిసింది.
తాజాగా మంత్రి పొన్నం జీవన్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో తన భవిష్యత్ చిత్రం కళ్లముందు కనిపించిందని అంటున్నారు. అందుకే ఈసారి సీరియస్‌గానే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు జగిత్యాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ జీవన్‌రెడ్డిని దగ్గరగా గమనించిన వారు మాత్రం… అంత సీన్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. 2014లో ఇవే తనకు చివరి ఎన్నికలంటూ బరిలోకి దిగి… 2018 కి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో గతం గతః… ఇప్పుడు అలా కాదు… ఆల్రెడీ కారు డోర్స్ తీసి రెడీగా ఉన్నాయి.పార్టీ మారడం పక్కా అంటున్నారు కొందరు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జీవన్‌రెడ్డి చాలా కాలం నుంచే టచ్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ ఊపుతోనే జీవన్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపే ప్రయత్నం చేశారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి అటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైట్ తీసుకోవడం… ఇటు రాజ్యసభ దక్కకపోవడం… కనీసం ఏదన్నా పదవి వస్తుందన్న హామీ కూడా రాకపోవడంతో ఫైనల్‌గా విసిరిన రాజీనామా పాచిక పనిచేస్తుందా..? పెద్దాయన జెండా మార్చడం ఖాయమేనా…? లేదంటే గతంలో మాదిరిగానే తూచ్ అంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..