Off The Record : దానం అనర్హత పిటిషన్ విచారణలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
- దానం అనర్హత పిటిషన్ విచారణలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
- కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేయడమేపెద్ద ఎవిడెన్స్ అన్న బీఆర్‌ఎస్
- బీఆర్‌ఎస్ ఫిర్యాదు టైంకు నేను పోటీ చేయలేదన్న దానం
- ఫిర్యాదు తర్వాతి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవద్దని విన్నపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దానం నాగేందర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఆయనకు క్లారిటీ లేదా…? లేక కావాలనే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా…? ఆయన అనర్హత పిటిషన్ విచారణలో కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటి? ఆ విషయమై బీఆర్ఎస్‌కు, బీజేపీకి ఉన్న తేడా ఏంటి? బీజేపీ ఉచ్చు ఎమ్మెల్యే మెడకు బిగుసుకుంటుందా? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ మలుపులు తిరుగుతోంది. దీనికి సంబంధించి BRS వేసిన పిటిషన్ విచారణ ముగిసింది. అయితే… బీజేపీ పిటిషన్ విషయంలో కొన్ని పేచీలు తెర మీదకు వచ్చాయి.
దానం పార్టీ మారాడని చెప్పడానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేసిన దానికంటే పెద్ద ఎవిడెన్స్ ఏముంటుందని వాదిస్తూ వచ్చింది బీఆర్‌ఎస్. అయితే… సరిగ్గా అక్కడే ఓ మెలిక వేసి పెట్టారు ఎమ్మెల్యే. ఫిర్యాదు చేసే నాటికి నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒకసారి ఫిర్యాదు చేసిన తర్వాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవద్దంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారాయన. అక్కడే కొత్త పేచీ వచ్చి పడింది. అటు బీజేపీ కూడా అనర్హత పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యింది.
Also Read
అయితే…. బీజేపీ ఫిర్యాదు చేసే నాటికి దానం కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నారు. దాంతో… ఎట్నుంచి ఎటు చూసుకున్నా… మేం వేసిన పిటిషన్‌కే ఎక్కువ విలువ ఉందని, విచారణ అర్హత ఉందని వాదిస్తోంది కాషాయ దళం. దానం అఫిడవిట్ ఇవ్వడానికి అంత సుముఖంగా లేరంటూ మొదట్లో… Brs, బీజేపీ అడ్వకేట్స్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వాదనలు వినిపించడానికి ఆయన ముందుకు వచ్చారు. మూడు రోజుల క్రితమే విచారణ ముగియాల్సి ఉన్నా.. బీజేపీ అడ్వకేట్స్ సరికొత్త ట్విస్ట్‌ను తెర మీదికి తీసుకువచ్చి విచారణార్హత గురించి ప్రస్తావించడంతో దానం తరపు అడ్వకేట్స్ కూడా గడువుకోరి శనివారంనాడు తమ వాదన వినిపించారు. దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే… మొదట నేను పార్టీ మారలేదని, తర్వాత.. నేను అందరిలాగా కాదు… కాంగ్రెస్‌లో చేరానని మీడియా ముందు ప్రకటించి దానం నాగేందర్ ఎందుకు ఇలా ఆగమాగం అవుతున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. రోజుకో అంశాన్ని మెన్షన్ చేయడంతో అసలు దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!