Off The Record : ఢిల్లీ వర్సెస్ గల్లీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై తెలంగాణ నేతల గుర్రు?
- పట్టుమని పది నామినేటెడ్ పోస్ట్‌లు లేవని అసహనం
- ప్రతిసారి పేర్లు అడగడం, ఫైనల్‌గా హ్యాండ్ ఇవ్వడం
- పార్టీయే జీవితంగా ఉన్నవాళ్ళకు పదవులెక్కడని నిలదీతలు
- 8మంది ఎంపీలను ఇచ్చినా మొండి చెయ్యేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ హైకమాండ్ తీరుపై తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారా? ఎంత చేసినా ఇంతేనా అని నిష్టూరంగా మాట్లాడుతున్నారా? ఏం… మాకేం తక్కువ, ఎందుకిలా చిన్నచూపు చూస్తున్నారంటూ ఒకింత నిలదీత స్వరం వినిపిస్తున్నారా? ఇంతకీ… ఏ విషయంలో టీజీ బీజేపీ నాయకులకు ఢిల్లీ పెద్దల మీద కోపం వస్తోంది? 8మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్ర నాయకులు ఏం కోరుకుంటున్నారు? నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా…. ఇప్పటిదాకా పట్టుమని ఓ పది మంచి నామినేటెడ్ పదవులు ఇచ్చింది లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ పలుమార్లు పేర్లు అడిగినా…. ఫైనల్ లిస్ట్‌లో మాత్రం… రాష్ట్రం నుంచి పంపిన పేర్లు ఉండటం లేదట. అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం దశాబ్దాల తరబడి పని చేస్తున్న వారికి కాస్త మంచి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది తెలంగాణ బీజేపీలో. ప్రోటోకాల్ , హోదా ఉండే పోస్ట్‌లు కావాలని అడుగుతున్నారు నాయకులు. ఏళ్ల నుండి ఆటుపోట్లను తట్టుకుని పార్టీయే జీవితంగా బ్రతికిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని అభిప్రాయం నేతల్లో బలంగా ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పని చేసిన వారికి పెద్దపీట వేస్తూ…పదవులు ఇచ్చిందని, అదే పద్ధతి మన దగ్గర ఎందుకు లేదంటూ కమలం నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి ఇచ్చినా, కష్టకాలంలో పార్టీని ఆదుకున్నా… ఇక్కడి వారికి మాత్రం మొండి చెయ్యే మిగులుతోందన్నది రాష్ట్ర నాయకుల ఆవేదన. పార్టీ ఢిల్లీ నాయకత్వం ఎందుకింత చిన్న చూపు చూస్తోందంటూ వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారట. అసలు పార్టీ ఎంపీలే లేని రాష్ట్రాల్లో పార్టీ కోసం పనిచేశారంటూ మంచి పోస్ట్‌లు ఇస్తున్న ఢిల్లీ పెద్దలు ఇటువైపు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఇక్కడ ఎందుకు బలోపేతం చేయడం లేదంటూ అడుగుతున్నారు. కనీసం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అయినా… తెలంగాణ నేతలకు పదవులు ఇస్తారని అనుకున్నారట. కానీ… రెండేళ్ళు కావస్తున్నా అతీగతీ లేదంటూ అధిష్టానం మీద ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఈ ఫ్రస్ట్రేషన్‌లో నుంచే కొత్త ప్రతిపాదన వస్తోందట.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
పార్టీ ముఖ్యనేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఎక్కువ కాలంగా విధేయతతో పనిచేస్తున్న వారి పేర్ల లిస్ట్‌తో అధిష్ఠానం దగ్గరికి పోయి ఒత్తిడి చేయాలన్న వాదన బలపడుతోంది. పెద్ద తలకాయలు గట్టిగా పట్టు పడితే కొన్ని పదవులైనా వస్తాయన్న చర్చ జరుగుతోంది తెలంగాణ బీజేపీలో. ఇక ఈసారి రాజ్యసభ సీటు కూడా తెలంగాణ నుంచి ఎవరికీ లేదు. కానీ… గతంలో ఒకరిద్దరు నేతలకు రాజ్యసభ హామీ ఇచ్చారట. అందులో ప్రధానంగా గరికపాటి మోహన్ రావు పేరు వినిపిస్తోంది. ఆయన గతంలో రాజ్యసభ సభ్యునిగా ఉంటూనే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పుడే హామీ ఇచ్చారని, ఇప్పటికీ అది హామీగానే మిగిలిపోయిందని అంటున్నారు. ఓవరాల్‌గా బీజేపీ హై కమాండ్ గాలి ఎప్పుడు తెలంగాణ వైపునకు మళ్ళుతుందో, ఇక్కడి నేతలకు పదవులు ఎప్పుడు వస్తాయోనన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.
- Tags
- NTV Telugu
- OTR
- TG BJP
తాజావార్తలు
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!