జనసేనకు ఆయువుపట్టుగా నిలిచిన ఆ జిల్లాలో ఇప్పుడు పరిస్థితి తల్లకిందులవుతోందా? ఎగిరెగిరి దంచినా అంతే…. ఎగరకుండా దంచినా అంతేనంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడే కాడి పడేశారా? అధినేత ఆంతర్యాన్ని గమనించకుండా ఎమ్మెల్యేలు సొంత అజెండాతో ముందుకు పోతూ… పార్టీ పరువు తీస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? జనసైనికులు ఏమంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు సీట్లు అందించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జోష్ మీద కనిపించాల్సిన పార్టీ నేతల్లో అసంతృప్తితో పాటు అయోమయం కూడా పెరిగిపోతోంది.…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితేంటి? గ్రామీణ ప్రజానీకం వాళ్ళని నమ్మారా? లేక మేం నమ్మి ఓట్లేస్తే మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మారిపోయారని తిరస్కరించారా? ఏ నియోజకవర్గంలో ఎవరి సంగతి ఎలా ఉంది? వాళ్ళు కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యారా? లేక మైనస్‌గా మారిపోయారా? లెట్స్ వాచ్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు ముగియగా… వచ్చే 17న మూడో విడత జరుగుతుంది. మొదటి రెండు విడతల్లో అధికార కాంగ్రెస్…
Drug Injection Scam: పాతబస్తీలో జోరుగా మత్తు ఇంజక్షన్ల దందా జోరుగా కొనసాగుతుంది. మత్తు ఇంజక్షన్ దందాపై ఎన్టీవీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అనస్థీషియా డ్రగ్ తీసుకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మత్తు ఇంజెక్షన్ల ఓవర్ డోస్ తో యువకులు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు.
పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తెలంగాణ సీఎం కసరత్తు మొదలుపెట్టారా? పాత వాసనలు లేకుండా అడ్మినిస్ట్రేషన్‌ను గాడిలో పెట్టాలని డిసైడయ్యారా? అందు కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకోబోతున్నారా? ఏంటా ప్రత్యేక జాగ్రత్తలు? ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 17న మూడో విడత పోలింగ్ ముగియగానే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి… పరిపాలనా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట సీఎం…
ఏపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ విషయమై వైసీపీలో వాయిస్ తేడాగా ఉందా? ఎక్కువ మంది నాయకులు యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారా? మీరు ఏదేదో ఊహించేసుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు గురూ… అంటూ ముందే సందేశం పంపుతున్నారా? ప్రతిష్టాత్మక పోరులో ప్రతిపక్ష నేతల వెనకడుగుకు కారణం ఏంటి? వాళ్ళు చెబుతున్న ఆసక్తికరమైన లెక్కలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే… 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. గ్రామ…
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే బ్యాచ్ చాలామందే ఉంటారు. ముఖ్యంగా పాలిటిక్స్‌లో అయితే… ఈ బాపతు ఇంకాస్త ఎక్కువ. ఎక్కడ… మైలేజ్‌లో మనం వెనుకబడిపోతామోనన్న కంగారులో క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదిబడితే అది మాట్లాడే లీడర్స్‌కు కొదవేలేదు. ఇప్పుడో మాజీ ఎంపీ కూడా అలాగే మాట్లాడి ఇరుక్కుపోయారట. సమాధానం చెప్పండి సార్…అంటూ పోలీసులు వెంటాడుతున్న ఆ మాజీ ఎంపీ ఎవరు? ఏమన్నారాయన?రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు… ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. కాకపోతే…. మనం ఏం మాట్లాడుతున్నామన్న స్పృహ…
సాధారణంగా… సమ్మర్ హీట్‌లో సైతం కూల్‌కూల్‌గా కనిపించే ఆ కేంద్ర మంత్రి ఇప్పుడు ఇంత చలికాలంలోనూ ఎందుకు గరం గరంగా మారిపోయారు? ఓ జిల్లాకు జిల్లా పార్టీ నేతలు మొత్తాన్ని నిలబెట్టి కడిగేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జిల్లా నాయకులు ఒకటి తలిస్తే… సెంట్రల్ మినిస్టర్ మరోటి అనుకున్నారా? ఎవరా మంత్రి? ఏ జిల్లా నాయకులతో ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నారు? నల్లగొండ జిల్లా కమలం నేతలకు ఓ రేంజ్లో క్లాస్‌లు పడ్డాయట. సాధారణంగా ఎప్పుడూ సౌమ్యంగా…
ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారా? ఇన్నాళ్ళు జగనన్నకు జై కొట్టిన ఆ చేతులు మరో పార్టీ జెండా పట్టుకోబోతున్నాయన్న ప్రచారంలో నిజమెంత? తరచూ నియోజకవర్గాలు మారుస్తూ తనతో పొలిటికల్ షటిల్ సర్వీస్ చేయిస్తున్నారన్న అసహనం ఆమెలో పెరుగుతోందా? నేను వైసీపీని వదలబోనని సదరు నేత చెబుతున్నా ప్రచారం మాత్రం ఎందుకు ఆగడం లేదు? లోగుట్టు ఏంటి? విడదల రజని….ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయిన లీడర్ కమ్ ఎక్స్ మినిస్టర్.…
మహిళల సొమ్ము కోట్లలో దండుకున్న దొంగలెవరు? బోగస్ గ్రూపులు పెట్టి లోన్లు తీసుకుని సొంత ఖాతాలకు మళ్ళించుకున్న దోపిడీ గాళ్ళకు ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండగా నిలబడుతున్నారా? అది కూటమిలో విభేదాల్ని పెంచుతోందా? ముఖ్య నేతలు ఇద్దరూ సీరియస్‌గా దర్యాప్తు జరిపించమని కోరుతుంటే… అసలు గోల్మాల్ గాళ్ళు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ నిధుల్ని కోట్లలో కొట్టేశారు? ఒంగోలు మెప్మాలో బోగస్ గ్రూపులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన వ్యవహారం ఇప్పుడు స్టేట్ టాపిక్…
మీకో దండం సామీ…. ఆయన్ని కెలకొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ….. టీడీపీ పెద్ద లీడర్స్‌తో మొరపెట్టుకుంటున్నారట ఆ నియోజకవర్గ నాయకులు. మీరు వస్తారు, ఏదో మాట్లాడి వెళ్తారు, తర్వాత ఆయన అటాక్‌ని కౌంటర్ చేసుకోలేక మాకు తల ప్రాణం తోకకు వస్తోంది. ఏదన్నా చేయగలిగితే చేయండి, లేదంటే నోరు మూసుకోండి అని ఘాటుగానే అంటున్నారట. అధికార పార్టీకి అంత కొరకరాని కొయ్యలా మారిన ఆ లీడర్ ఎవరు? ఎక్కడుందా పరిస్థితి? వైసీపీ అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు…