Off The Record : బీజేపీలోకి రాజాసింగ్ రీ ఎంట్రీ ఇక లాంఛనమేనా..?
- బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసి ఏడు నెలలకు పైనే
- రాష్ట్ర నేతల మీద విమర్శలు, ఢిల్లీకి పొగడ్తలు
- రీ ఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలే చేసిన రాజాసింగ్
- ఢిల్లీ పెద్దలకు దగ్గరగా ఉండేవాళ్ళతో రాయబారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ తెలంగాణ ఎమ్మెల్యే తిరిగి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందా? పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఫైనల్‌గా ఆయన సాధించారా? ఆ మేరకు పార్టీ పెద్దలు లోకల్ లీడర్స్‌కు ఇండికేషన్ ఇచ్చారా? ఇన్నాళ్ళు నడిచిన వన్‌సైడ్ లవ్ ఇక టూ వే అయినట్టేనా? ఎవరా శాసనసభ్యుడు? బీజేపీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళారు? ఎలా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? ఫైర్ బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసి ఏడు నెలలు దాటిపోయింది. ఆ రాజీనామాను అప్పుడే పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదించేసింది. అలాగే…. ఆయన తన రిజైన్ లెటర్‌లో పేర్కొన్న అంశాలను తప్పు బట్టింది కూడా. ఇక అప్పటి నుంచి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు వ్యవహరిస్తున్నారు రాజాసింగ్. పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు కొందర్ని విమర్శిస్తూ, ఢిల్లీ పెద్దల్ని పొగుడుతూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
అదే సమయంలో తాను మళ్లీ బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేవారాయన. కేంద్ర పార్టీ ఒకే చెప్పింది, ఇక్కడి వాళ్ళే అడ్డుకుంటున్నారని కూడా ఒకటి రెండు సందర్భాల్లో కామెంట్ చేశారు రాజాసింగ్. కేవలం మాటలతో సరిపెట్టకుండా… సమాతరంగా గట్టి ప్రయత్నాలే చేశారట. ఢిల్లీ పెద్దలకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళతో రాయబారాలు నడిపినా… ఇప్పటిదాకా వన్‌సైడ్ లవ్ మాత్రమే పైకి కనిపించింది. పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ… ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయట. విసుగు విరామం లేకుండా రాజాసింగ్ చేసిన వేసిన ట్రయల్స్ ఒక కొలిక్కి వచ్చేసినట్టే కనిపిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలో చేరడం ఖాయమంటూ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు అందాయట. గోషామహల్ బీజేపీ లీడర్స్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసినప్పుడు రాజాసింగ్ రీ ఎంట్రీ ఖాయమన్న సంకేతాలిచ్చినట్టు తెలిసింది. దీని గురించి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గట్టి చర్చే జరుగుతోంది. ఆయనతో సమన్వయం చేసుకుంటూ… ముదుకు వెళ్ళాని కూడా కిషన్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది.
Also Read
గతంలో కూడా ఒకసారి రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తరవాత సస్పెన్షన్ ఎత్తేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. తిరిగి గెలిచాక కూడా… రాష్ట్ర పార్టీ మీద, ఇక్కడి నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశారాయన. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావును ప్రకటించాక తీవ్ర స్థాయిలో మాట్లాడారు రాజాసింగ్. రకరకాల కారణాలు చెబుతూ…గత జూన్ 30న పార్టీకి రిజైన్ చేశారాయన. కేంద్ర పార్టీ కూడా పెద్ద టైం తీసుకోకుండా ఆ లేఖను వెంటనే ఆమోదించేసింది. కానీ… ప్రస్తుతం ఆయన విషయంలో పార్టీ వైఖరి మారిందట. గోషామహల్ ఎమ్మెల్యేకి తిరిగి వెల్కమ్ చెప్పడానికి అంతా సిద్ధమైపోయినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు. రాజాసింగ్ మరోసారి కమలాన్ని పట్టుకోవడానికి ఇక ముహూర్తనే మిగిలి ఉంది.
- Tags
- NTV Telugu
- OTR
- raja singh
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!