Off The Record : అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కబోతోంది..?
- సీఎం ముఖ్య సలహాదారు పదవికి వేం నరేందర్‌రెడ్డి రాజీనామా
- మళ్ళీ ఆయనకే ఇస్తారా? లేక కొత్త వాళ్ళని నియమిస్తారా?
- ఎక్కువ సమయం ముఖ్యమంత్రితో ఉండే పోస్ట్
- సీఎంకు నరేందర్‌రెడ్డి లాంటి ఇంకో నమ్మకస్తుడు ఎవరున్నారంటూ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కబోతోంది? నిత్యం ముఖ్యమంత్రి వెన్నంటి ఉంటూ ఆయనతో పాటే రివ్యూ మీటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్న ఆ పోస్ట్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? అరడజన్‌కు పైగా ఆశావహులు పోటీ పడుతున్న ఆ పదవి ఏది? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళకు దక్కుతుందా, లేక అధిష్టానం కోటాలో వెళ్తుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది కాంగ్రెస్ నాయకత్వం. రెండిటిలో ఒకటి పార్టీ సీనియర్ లీడర్ అభిషేక్ సింఘ్వికి, మరొకటి సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి ఫిక్స్ అయ్యాయి. ఆ మేరకు ఇద్దరూ నామినేషన్ వేశారు కూడా. ఎన్నిక కూడా లాంఛనమేనని అంటున్నారు.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
అయితే… నామినేషన్‌కు ముందు తన సలహాదారు పదవికి రాజీనామా చేశారు వేం. ఇదే ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పదవిలో వేరే ఎవర్ని అయినా నియమిస్తారా? లేక వేం నరేందర్‌రెడ్డికే తిరిగి ఇస్తారా? అదీఅదీ కాదని అసలు ఖాళీగా ఉంచుతారా రకరకాల డిస్కషన్స్ మొదలయ్యాయి. అదే సమయంలో సీఎం సలహాదారు పదవి కోసం అర డజన్ మంది కాంగ్రెస్ ఆశావహులు పోటీ పడుతున్నారట. దీనికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే పది మంది సలహాదారులు ఉన్నారు. కానీ… అన్నిటికంటే అతి ముఖ్యమైన పోస్ట్ ముఖ్యమంత్రి సలహాదారు పదవి.
ఎక్కువ సమయం ముఖ్యమంత్రి వెంటే ఉంటూ ఆయనతో పాటే వివిధ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన వేం నరేందర్ రెడ్డి అలానే వ్యవహరించారు కూడా. ఇప్పుడు కొత్తగా రాబోయే సలహాదారు కూడా అలానే నడుచుకోవాల్సి ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రికి నరేందర్‌రెడ్డి అంత నమ్మకస్తుడు మరొకరు ఎవరు ఉన్నారు? ఉన్న వారిలో ఎవరికి ఆ పదవిని అప్పగిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో చీఫ్ అడ్వైజర్ పోస్ట్‌ను తిరిగి వేం నరేందర్ రెడ్డికే అప్పగిస్తారనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజా భద్రతా సలహా సంఘం చైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా కేవీపీ రామచంద్రరావు కొనసాగారు. అయితే… అప్పట్లో ఆ పదవి చేపట్టిన కేవీపీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు లేవు. ఆ సంగతి ఎలా ఉన్నా…గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వేం నరేందర్ రెడ్డిని రెండు పదవుల్లో కొనసాగించాలంటే…
చట్ట సవరణ చేసి పోస్టు క్రియేట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.
ఒకవేళ అంత దూరం ఎందుకు,లేనిపోని సమస్యలు అనుకుంటే మాత్రం ఆ పదవిలో కొత్త వాళ్లను నియమించుకుంటే సరిపోతుంది. ఇక ఆశావహుల్లో నిన్నటి వరకు రాజ్యసభ రేసులో ఉన్న వి. హనుమంతరావుకు ముఖ్యమంత్రి సలహాదారు పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీయే గాక బీసీ నేతగా, వీటన్నిటికీ మించి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరుంది. ఆయనతో పాటు మరికొందరు సీనియర్స్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి వెంట ఉండే రోహిణ్ రెడ్డి, ఫహిమ్ ఖురేషీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అంటే… ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా అందర్నీ కలుపుకొని పోయే లక్షణం ఉండాలి. దీంతో ముఖ్య సలహాదారు పదవి విషయమై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన్నన ఉత్కంఠ పెరుగుతోంది.
- Tags
- NTV Telugu
- OTR
- telangana
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..