Home
Ntv Telugu
Ntv Telugu News
-
OTR: గ్లోబరీనా కేంద్రంగా సీఎం, కేటీఆర్ సవాళ్ల పర్వం
తెలంగాణ పొలిటికల్ తెర మీద మళ్ళీ గ్లోబరీనా బొమ్మ పడిందా? ఆ సంస్థ కేంద్రంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత మధ్య మొదలైన సవాళ్ళ పర్వం ఎటు పోతోంది? ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యేదాకా అది ఆగబోదా? నీట్ పేపర్ లీకేజీపై దేశమంతటా రచ్చ అవుతుంటే... ఇక్కడ మాత్రం ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది? రెండిటికీ ఉన్న లింకేంటి? -
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
ఏందన్నా…. పుసుక్కున అంత మాట అనేశావ్. మనోళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు. అలా ఎలా ఇరికించావ్ అంటూ సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తుంటే ఆ వైసీపీ నేత సమాధానం చెప్పలేకపోతున్నారట. అదే సమయంలో ఆయన మాటల్ని అడ్వాంటేజ్ తీసుకున్న టీడీపీ చెలరేగిపోతోంది. అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే…… అంటూ సదరు మాజీ ఎమ్మెల్యే సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ఎవరి చెవికి ఎక్కడం లేదు. ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఆయన వివరణలు జనానికి చేరుతున్నాయా? డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చుగానీ…. నోరు జారితే… -
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
అప్పుడెప్పుడో.... మూతబడ్డ ఫ్యాక్టరీ ఇప్పుడెందుకు తెలంగాణలో పొలిటికల్ అజెండా అయింది? దశాబ్దాలుగా ఎన్నికల హామీకే పరిమితమైన పరిశ్రమ పునరుద్ధరణ ఉన్నట్టుండి ప్రాధాన్యతాంశంగా మారడానికి కారణం ఏంటి? ప్రాణ త్యాగాలు, ఆమరణ నిరాహార దీక్షల్లాంటి మాటల వెనక మర్మం ఏంటి? ఏదా ఫ్యాక్టరీ? దాని కేంద్రంగా అంటుకుంటున్న రాజకీయ మంటలేంటి? -
OTR : నరసాపురం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్?
అసెంబ్లీకి వెళ్ళే దారేది…? టార్గెట్ చేరుకునే తీరేది… అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌లు రెడీ చేసుకుంటున్నారా? ప్రస్తుతం టీడీపీలో ఉన్నా… ఆ రోజుకు ఎవరు టిక్కెట్ ఇస్తే వాళ్ళే మనోళ్ళు అనుకుంటున్నారా? నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అస్సలు బతిమాలుకోవాల్సిన పనేలేదు, టిక్కెట్ వచ్చి ఒళ్ళో వాలిపోతుందని భావిస్తున్నారా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఆయన వేసుకుంటున్న కులాల లెక్కలేంటి? 2014 ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బండారు మాధవ నాయుడు.… -
OTR : రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?
ఫైర్ బ్రాండ్ వాయిస్ ఎందుకు మూగబోయింది? అయినదానికి, కానిదానికి…. నేనున్నానంటూ ఒకప్పుడు మీడియా మైకుల ముందు స్వరం సవరించుకునే ఆ లీడర్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయంలో వైసీపీ అటాక్ మోడ్‌లోకి వస్తే…. ఆ మాజీ మంత్రి మాత్రం పిలిస్తే వెళతానన్నట్టు ఎందుకు ఉంటున్నారు? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఏంటా కథ? పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్…. వైసీపీ నోరున్న నేతల్లో ఒకరిగా మాజీ మంత్రి ఆర్కే రోజాకు గుర్తింపు ఉంది.… -
OTR : పొంగులేటి మీటింగ్‌కు కొండా సురేఖ ఎందుకు వెళ్లలేదు?
ఆ ఇద్దరు తెలంగాణ మంత్రుల మధ్య అస్సలు సఖ్యత లేదా? అందుకే ఇన్ఛార్జ్ మంత్రి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు జిల్లా మినిస్టర్ వెళ్ళలేదా? ఎవరా ఇద్దరు? వేర్వేరు జిల్లాలకు చెందిన కేబినెట్ సహచరుల మధ్య ఏ విషయంలో బెడిసి కొట్టింది? పార్టీ పెద్దలు ప్రయత్నించినా ప్యాచ్ అవకపోవడం వెనకున్న బలమైన కారణాలేంటి? పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నా…. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. ఎప్పుడూ ఏదో… -
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
ఆ ఎమ్మెల్యేకి కలిసి వచ్చేలా ఇంచార్జ్ కమిషనర్ చక్కగా చక్క పెడుతున్నారా? అందుకే అసలు పోస్టింగ్ వదిలి..కొసరు పోస్టింగ్‌నే కాపాడుతున్నారా? గత ప్రభుత్వంలో అదే ప్లేస్‌లో ఆర్డీవోగా ఉండి…అప్పట్లో తప్పని చెప్పినవి ఇప్పుడు రైట్ చేస్తున్నారా..? పాత పరిచయాలతో వైసిపి నేతలకు….ఎమ్మెల్యేకి మధ్య కమీషనర్ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నారా? సీఎం చంద్రబాబు చివాట్లు పెట్టినా…అదే కమిషనర్‌ను కొనసాగించడంలో సదరు ఎమ్మెల్యే కథేంటి? కాకినాడ సిటీ టిడిపి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నియోజకవర్గం మొత్తం కాకినాడ కార్పొరేషన్ పరిధిలో… -
OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
పార్టీ చెప్పింది వినాలి…చెయ్యమన్నది చెయ్యాలి…అంతర్గత కుమ్ములాటలు విడిచిపెట్టాలి…ఈటల రాజేందర్, బండి సంజయ్ సయోధ్యలో అధిష్టాన పెద్దలు ఇవే మాటలు చెప్పారా? కుస్తీ వదిలి దోస్తీ కట్టాల్సిందేనని ఉపదేశించారా? ఉప్పు-నిప్పులా వ్యవహరించిన ఈటల, బండి సంజయ్ మధ్య రాజీ ఎలా కుదిరింది? ఈటల ఇంట్లో అసలేం జరిగింది? తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు బహిరంగ రహస్యం. ఇద్దరి మధ్య పార్టీలో కోల్డ్ వార్ పీక్ లెవల్లో వుంటే, అటు ఇరువురు… -
OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…ములుగులో గులాబీ దళం ఇలాంటి స్కెచ్‌తోనే పొలిటికల్ హీట్ పెంచుతోంది. అటు భద్రాచలం, ఇటు ములుగులో తమ స్ట్రాటజీ అప్లై చెయ్యడానికి ఊహకందని వ్యూహం వేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఈ ఒక్క వీడియో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ నేతలతో పోడెం వీరయ్య కనిపించిన దృశ్యాలు రకరకాల… -
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ఆ జనసేన ఎమ్మెల్యే ఏకంగా కూటమి ప్రభుత్వానికే షాకిచ్చారా? మంత్రికి సార్ రాసిన సిఫారసు లేఖలు చూసిన ప్రతి ఒక్కరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందా? పైరవీలకు కూడా ఒక పద్ధతీ… పాడూ…. ఉంటాయి కదా…? ఇవెక్కడి సిఫారసులుగా…బాబూ… అంటూ అంతా తల బాదుకుంటున్నారా? నవ్విపోదురుగాక… నాకేటి సిగ్గు అంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఎలాంటి సిఫారసు లేఖ, ఎవరికి రాశారు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్….విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే. సీనియర్ శాసనసభ్యులు చాలా మందే…
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!