నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పవన్ గుంటూరు చేరుకోనున్నారు. నగరం పాలెంలోని అరణ్య భవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ నందు APMSA స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి వరకు పలు కార్యక్రమాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు.
ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవాలయానికి చేరుకుంటారు. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
నేడు హన్మకొండకు దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ రానున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను ఆయన సందర్శించనున్నారు.
నేడు హన్మకొండ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రాంపూర్ సమీపంలో పెళ్లికి హాజరు కానున్నారు. అనంతరం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఏస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
నేడు నాంపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. మల్లేపల్లి, అసిఫ్ నగర్ డివిజన్‌లలో కమ్యూనిటీ హాల్‌లు ప్రారంభిస్తారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోంది. నవంబర్ 12, 13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గెబేహా వేదికగా రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.