*రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఇక 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేసింది. 2014-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందన్నారు. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు ఉండగా.. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లు. పదేళ్లలో సగటున 24.5 శాతం రాష్ట్ర అప్పులు పెరిగిందని.. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో వెల్లడించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే.. బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందని.. పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదన్న ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లుగా 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం ద్వారా వెల్లడించింది. మరి దీనిపై ప్రతిపక్ష నేతలు ఏం సమాధానం ఇవ్వనున్నారు తెలియాల్సి ఉంది. శాసన సభలో మళ్లీ వాడి వేడి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పులు ఊబిలో తెలంగా ఉందని అధికారపక నేతలు విపకాలపై విరుచుకుపడుతున్నాయి. అప్పులే కాదు ఆస్తులు కూడా పెరగాయని బీఆర్ఎస్ చెబుతుంది. అయితే దీనిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయడంతో.. శాసనసభలో ఆర్థిక స్థితిగతులపై హాట్ హాట్ గా చర్చ జరగనుంది. ఆర్థిక పరిస్థితిపై 42 పేటీలు ఇచ్చిన నిమిషంలోనే మాట్లాడమంటే ఎలా? అంటూ విపకాలు ప్రశ్నించాయి. కనీసం అరగంట పాటు సమయం ఇవ్వాలని అందులో ఏముందో తెలుసుకుని ప్రశ్నిస్తే బాగుంటుందని అన్నారు. కాగా.. అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం కాగానే అరగంటపాటు వాయిదా పడింది.
*కోవిడ్ కొత్త వేరియంట్ వార్తలన్నీ ఫేక్.. గాంధీలో కేసులేమీ నమోదు కాలేదు..
కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వస్తున్న వదంతులను నమ్మవద్దు. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో జోరుగా సాగుతున్న జేఎన్-1 వేరియంట్‌తో ఐదుగురు గాంధీ ఆస్పత్రిలో చేరారనే ప్రచారం పూర్తిగా బూటకమన్నారు. అనవసరంగా భయాందోళన చెందకండి. కోవిడ్ నిబంధనలను పాటించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర కోవిడ్ నోడల్ సెంటర్, సికింద్రాబాద్ గండి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడారు. కేరళలో విస్తరిస్తున్న జేఎన్-1 వైరస్‌తో గాంధీలో ఐదుగురు చేరారనేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో JN-1 వేరియంట్ కేసు నమోదు కాలేదు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు, సలహాలు చేసింది. ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర వైద్యాధికారులు సూచించారు. గాంధీ ఎమర్జెన్సీ విభాగంలో గతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పురుషులకు 30, మహిళలకు 20 మొత్తం 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి ముగిసిన తర్వాత, స్థానికంగా ఒకటి లేదా రెండు కేసులు నమోదు కావడం సాధారణం. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాబోయే క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు ముఖ్యమైనవి. కోవిడ్ వంటి వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. హ్యాండ్ శానిటైజేషన్ పాటించాలి. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, వైరల్ ఫీవర్‌లు ఎక్కువగా నమోదయ్యాయి. నవంబర్, డిసెంబర్‌లో తగ్గుదల కనిపించింది. ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ JN-1 మొదటిసారిగా అమెరికాలో కనిపించింది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కేరళలో విస్తరిస్తోంది. పరివర్తన చెందిన JN-1 సబ్‌వేరియంట్ అనేది స్వీయ-పరిమితి వైరస్. అది దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రత తక్కువగా ఉందని, ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు గుర్తించారు. మొదటి, రెండవ తరంగాలలో వ్యాపించే ఆల్ఫా, డెల్టా కంటే మూడవ వేవ్‌లో వచ్చిన ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది. ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ JN – 1. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు సంక్రమణకు గురవుతారు. వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వైరస్ యొక్క అన్ని తరంగాలు వేసవిలో ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇక కేరళలో జేఎన్-1 వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి జాగ్రత్తలు పాటించాలి. మళ్లీ చదివిన తర్వాత స్వీయ నియంత్రణ పాటించి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. కోవిడ్ కేసులు పెరిగితే గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన మార్గదర్శకాలను అమలు చేస్తాం. కోవిడ్ పరీక్షలు, పిపిఇ కిట్లు మరియు టీకాలు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి, కోవిడ్ కోసం నోడల్ సెంటర్, కోవిడ్ ఐసోలేషన్ వార్డుతో పాటు. అసత్య ప్రచారాలను నమ్మవద్దు. ఆందోళన పడకండి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, హ్యాండ్ శానిటైజేషన్ చేయాలి మరియు కోవిడ్ నిబంధనలను పాటించాలి.
*జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని తెలిపారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రూ. 8లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పాస్ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు.
*ఆర్టీసీ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే 51.74 లక్షల మంది ప్రయాణం
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా ఫ్రీగా ప్రయాణించవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మహిళలు బస్సుల్లో ప్రయాణించడం పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో బస్సుల రాకపోకలు పెరిగిపోయి నిలబడే పరిస్థితులు లేవు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్ 19) రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది. వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు, మొత్తం ప్రయాణీకులలో కేవలం 40 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరుకుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రీయింబర్స్‌మెంట్‌తో కలిపి ఒక్కరోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ఆర్టీసీ జోన్ల పరిధిలో సోమవారం బస్సులు 33.36 లక్షల కి.మీ. కరీంనగర్ జోన్‌లో గరిష్టంగా 14.49 లక్షల కిలోమీటర్లు, హైదరాబాద్ జోన్‌లో 10.93 లక్షల కిలోమీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 7.94 లక్షల కిలోమీటర్ల మేర తిరిగినట్లు వెల్లడించారు.
*ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. అప్రమత్తమైన వైద్యశాఖ
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి.కృష్ణబాబు వెల్లడించారు. కొవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన మీడియాతో చెప్పారు. ఏపీ నుంచి ఈ సీజన్‌లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారని.. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామని ఆయన తెలిపారు. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించామన్నారు. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తామన్ని చెప్పారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు JN-1 కొత్త వేరియంట్‌లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారని కృష్ణబాబు తెలిపారు.ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వెంటిలేటర్లకు, కొవిడ్ మందులకి కొరత లేదని కృష్ణబాబు వెల్లడించారు.
*కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ… ‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. అన్ని ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకోసారి మాక్‌డ్రిల్స్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రాలకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. హెల్త్ ను రాజకీయ అంశంగా చూడొద్దు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 341 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలోనే 292 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అధికంగా కేరళ రాష్ట్రంలోనే కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్-1 ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని తెలిపింది.
*ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు.. ఎంపీల సస్పెన్షన్ పై సోనియా గాంధీ రియాక్షన్..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక, డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీల డిమాండ్ చేశారు.. వారికి మద్దతుగా సోనియా గాంధీ స్పందించారు. ఇక, 141 మంది విపక్ష ఎంపీలను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతు నొక్కింది అంటూ విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనంత మంది ప్రతిపక్ష సభ్యులను లోక్‌సభ,రాజ్యసభల నుంచి సస్పెండ్ చేయడం సహేతుకమైనది కాదని ఆమె అన్నారు. అయితే, డిసెంబరు 13న జరిగిన ఘటన క్షమించరానిది.. దానిని సమర్థించలేమని సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి నాలుగు రోజుల సమయం పట్టింది అని ఆమె తెలిపారు. ప్రధాని సభ గౌరవాన్ని, దేశ ప్రజలను పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులను ఈ సెషన్‌లో పార్లమెంట్ లో ఆమోదించారు.. జవహర్‌లాల్ నెహ్రూ లాంటి గొప్ప దేశ భక్తుల పరువు తీసే ప్రయత్నాలు జరిగుతున్నాయని ఆమె తెలిపారు. చారిత్రక వాస్తవాలను నిరంతరం వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు.. ఈ ప్రయత్నాలకు స్వయంగా ప్రధాని, హోంమంత్రి నాయకత్వం వహించినా మేం భయపడం, తలవంచబోం, నిజం చెప్పడానికి మేము కట్టుబడి ఉంటాము అంటూ సోనియా గాంధీ ప్రకటించారు.
*భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్
భారత్ లో కరోనా వైరల్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా యొక్క కొత్త వేరియంట్ జెన్.1తో ప్రజలలో భయాందోళన సృష్టించింది. ఇదిలా ఉండగా.. రోజు రోజుకి కోవిడ్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఇవాళ రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేయనున్నారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సహా పలువురు ఇందులో పాల్గొంటారు. ఆరోగ్య సదుపాయాల కల్పిన, అంటువ్యాధుల నివారణ చర్యలపై ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కాగా, కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 115 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేళరలో రోగుల సంఖ్య 1,749కి చేరుకోగా.. మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్‌లలో కూడా కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలో జెన్.1 కొత్త వేరియంట్ 18, గోవాలో 18 కేసులు నమోదు అయ్యాయి. ఇక, దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 1970కి చేరుకుంది. గత 9 రోజుల్లో కరోనా సోకిన వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇవాళ దేశంలో కొత్త 142 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధుల నివారణకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. ఇన్‌ఫెక్షన్ లక్షణాలున్న వ్యక్తులను వెంటనే పరీక్షించాలని ఆయన సూచించారు.
*మణిపూర్‌లో మెరుగుపడని పరిస్థితి.. మరో 5రోజులు ఇంటర్నెట్ బంద్
గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఈ కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. సోమవారం జిరిబామ్ జిల్లాలో 32 ఏళ్ల వ్యక్తిని ఒక పోలీసు కాల్చి చంపాడు. ఈ హత్యతో ఆగ్రహం చెందిన ప్రజలు మంగళవారం పోలీసు లోయితం అరుంత సింగ్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. పరిస్థితిని నియంత్రించడానికి, 5 రోజుల పాటు ఇంటర్నెట్‌ను నిషేధించగా, చురచంద్‌పూర్ జిల్లాలో రెండు నెలల పాటు ఐపిసి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞను విధించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.ధరుణ్ కుమార్ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కారణంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు తర్వాత సోమవారం నుండి రాష్ట్రంలో సెక్షన్ 144 అమలు చేయబడింది. ఇది 18 ఫిబ్రవరి 2024 వరకు అమలులో ఉంటుంది. దీని ప్రకారం ఒకే చోట ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు నిలబడి ఉండటం లేదా గుమిగూడడం నిషేధించబడింది. ఆయుధాలు కలిగి ఉండటం కూడా నిషేధించబడింది. హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు చట్టాన్ని అమలు చేసే సంస్థలు అన్ని విధాలా ప్రయత్నించాయని జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. ఈ ఏడాది మే నెల నుంచి మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కుల వివాదం కొనసాగుతుండటం గమనార్హం. గత సోమవారం చురచంద్‌పూర్ జిల్లాలో ముఖ్యంగా తింగంగ్‌ఫాయ్ గ్రామంలో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. అయితే పెద్దగా నష్టం వాటిల్లలేదు. మణిపూర్‌లోని మెయిటీ కమ్యూనిటీ షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాను డిమాండ్ చేస్తోందని దానిని వ్యతిరేకిస్తున్నారు. మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌లకు నిరసనగా మే 3న గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించబడింది. ఆ తర్వాత కుల హింస చెలరేగింది. ఈ హింసలో 180 మందికి పైగా మరణించారు.
పరారీలో పల్లవి ప్రశాంత్.. పోలీసుల గాలింపు..
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వల్ల పబ్లిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటుగా ఫిలిం నగర్ పబ్లిక్ న్యూసెన్స్ ఘటనకు బిగ్ బాస్ సీజన్ -7 విజేత పల్లవి ప్రశాంత్ ప్రధాన కారకుడని జూబ్లీహిల్స్ పోలీసులుఅతడిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ 2 గా అతడి సోదరుడు పరశురాములు సహా మరి కొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.. అంతేకాదు ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉంటాడంతో అతడి అనుచరులను, స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగురు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ -7 విజేతగా ఎంపిక కాగా, అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు.ఈ నేథ్యంలోనే ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు.. అక్కడకు అమర్ దీప్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు..అమర్ దీప్ ను విజేతగా ప్రకటించకపోవడం తో అయన అభిమానులు గొడవకు దిగారు.. ఆ తర్వాత అమర్ కారు పై దాడి చేశారు.. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. వీరు దాడి చేసుకోవడమే కాక అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సుల పై కూడా రాళ్ళు రువ్వీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బయట రద్దీని చూసి పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అటుగా వెళ్ళొద్దని హెచ్చరించినా అతడు పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి ఓపెన్ టాప్ కార్ పై వెళ్ళాడు.దీంతో ఈ విధ్వంసం జరిగిందని పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.. అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ కొమురవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.. త్వరలోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆర్టీసీ బస్సులపై రాళ్ళు రువ్విన వారి కోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. ఈ ఘటన రకరకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..