Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines At 9am On 24th December 2024

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Published Date :December 24, 2024 , 9:18 am
By Sampath Kumar
Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నేడు కడపకు వైఎస్ జగన్:
నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్:
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ఏపీ, తెలంగాణల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సెలవుల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా క్రిస్మస్ సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈరోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆప్సనల్ సెలవులు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25, 26 తేదీలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ అయితే, డిసెంబర్ 26 బాక్సింగ్ డే 2024, కాబట్టి ఈ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి.

Also Read

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
Add as a preferred
source on google

ఈనెల 30న కేబినెట్ భేటీ:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రేషన్‌ కార్డులు,రైతుభరోసా కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి తర్వా రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

కేబీఆర్‌ పార్క్‌కు వెళ్లాలంటే నెలకు రూ.1000:
బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మకమైన కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ ఫారెస్ట్ (కేబీఆర్) ప్రవేశ టికెట్ ధర పెంచారు. ప్రతి సంవత్సరం కేబీఆర్‌ పార్క్ ప్రవేశ టికెట్ ధర పెంచుతుండటంతో ఈ ఏడాది కూడా అధికారులు పెంచారు. కేబీఆర్‌ పార్క్‌ కు వెళ్లే వాకర్లు, సందర్శకులు పార్క్‌ సందర్శించేందుకు ప్రస్తుతం పెద్దలు రూ.45, పిల్లలకు రూ.25 ప్రవేశ రుసుము చెల్లిస్తున్నారు. అదే వాకర్స్‌ అయితే నెల వారీపాస్‌ రూ.850 చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు కేబీఆర్‌ పార్క్‌కు వెళ్లాలంటే పెద్దలకు రూ.50, పిల్లలు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. అదే వాకర్స్‌ అయితే నెల వారీ పాస్‌ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. అంటే సందర్శకులకు రూ.5పెంచగా.. నెల వారీ పాస్‌కు రూ.150 రుసుమును పెంచారు అధికారులు. వీటిని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులో వస్తాయని ప్రధాన గేటు వద్ద నోటీసులు అతికించారు. దీనిని సందర్శకులు, వాకర్స్‌లు గమనించాలని తెలిపారు. అయితే ఎంట్రీ ఫీజుపై వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.

నేడు అమెరికాకు కేంద్రమంత్రి జైశంకర్:
నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే, అమెరికా పర్యటనలో జైశంకర్ ప్రధానంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. అయితే, యూఎస్ లో జరిగే భారత కాన్సుల్స్ జనరల్ కాన్ఫరెన్స్‌కు ఎస్. జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో భాగంగా అమెరికా అధికారులతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

వచ్చే ఏడాదే బీహార్ ఎన్నికలు:
వచ్చే ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే జేడీయూ ఎన్డీఏ కూటమిలో భాగం ఉంది. నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేయగలదా అని అడిగిన ప్రశ్నకు… ‘‘మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాం. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము’’ అని అమిత్ షా గూఢమైన సమాధానం ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారి తీసింది.

సానియా, షమీ పెళ్లి:
సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి చేసుకున్నట్లు నెట్టింటి జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోస్ అన్ని ఫేక్. కొందరు ఆకతాయిలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సానియా, షమీ పెళ్లి చేశారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. సానియా, షమీ పెళ్లి చేసుకోలేదు.. వారి కెరీర్‌తో బిజీగా ఉన్నారు. మరి ఈ ఫోటోలపై ఇద్దరు స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

బన్నీని కడిగిపారేస్తానంటున్న గరికపాటి:
‘పుష్ప’ సినిమాలోని “తగ్గేదేలే” అనే డైలాగ్ పై గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. “స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా.. రేపు ఏ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదేలే అంటాడు.. దానికి ఎవరు కారణం..? ఆ సినిమా డైరెక్టర్, హీరో కనబడితే కడిగిపారేస్తాను” అని గరికపాటి మండిపడ్డారు. ఇదే సమయంలో… తగ్గేదేలే అని ఒక హరిశ్చంద్రుడు, శ్రీరామ చంద్రుడు వంటి వారు అనాలి కానీ.. ఓ స్మగ్లర్ అనడం ఏమిటి? అంటూ గరికపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు! ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ… తాజా పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

సర్ ప్రైజ్ గెస్ట్:
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కోసం గ్రాండ్ ప్లానింగ్స్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్లానింగ్స్ లో జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్ ప్రైజ్ గెస్ట్ ను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. మరి దీని ప్రకారం ఆ అతిధి ఎవరో కాదు మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap news
  • ntv
  • ntv news
  • telangana news
  • Top Headlines @9AM

తాజావార్తలు

  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions