నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్ట్: విశాఖ నకిలీ ఐఏఎస్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ ఐఏఎస్‌లుగా అవతారం ఎత్తిన భార్య, భర్తల మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. భర్త జీవీఎంసీ కమిషనర్‌గా, భార్య హెచ్‌ఆర్‌సీ జాయింట్ కలెక్టర్‌గా మోసాలకు పాల్పడ్డారు. వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్‌లు కలిసి టిడ్కొ ఇల్లులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నకీలి ఐఏఎస్ జంట టిడ్కో…
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం: వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని…
కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని అధికారిక నివాసానికి సీఎం చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు కలనునారు. అలానే శివరాజ్ సింగ్ చౌహాన్,…
దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున బద్రీనాథ్ బాబు తన ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. చాలా ఏళ్లుగా ఆయన దుర్గగుడి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…
మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థుల మృతి: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధునూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని.. కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం రాత్రి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం…
నారా లోకేష్ వంద శాతం అర్హులు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో…
ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్: ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి…
టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు తెచ్చుకుంది: వైసీపీ హయంలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యాలయంలో ఫ్లెక్సీ వేశారు. ‘రాబందుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్తచరిత్ర’ అంటూ ప్రమాద ఘటనలకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభాకర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తొక్కిసలాటపై వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి ఆర్కే రోజా బెంజ్…
బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి. కారులో 7 కిలోల బంగారం ఉన్నట్లు వ్యాపారి…
యువకుల మృతి బాధాకరం: ఇటీవల రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. గత ఐదేళ్లలో కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఏడీబీ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని, ఇక…