రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని… “కలయిక ఫౌండేషన్” అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం…
NTR centenary celebrations: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళి ఆర్పించారు.
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు.
తెలుగు సినిమా చూసిన మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. హీరోల పక్కన పాటల్లో డాన్స్ మాత్రమే కాదు లేడీ ఓరియెంటడ్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నటించగలనని నిరూపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. స్టార్ హీరోల పక్కన నటించి, ఆ తర్వాత తనే ఒక స్టార్ గా ఎదిగిన విజయశాంతి సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు అప్పటికి ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూల స్థంబాల్లో ముఖ్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ ఉన్నా అన్నగారి జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రామారావుతో రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి… “నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు…
తాతకి తగ్గ మనవడిగా… నందమూరి వంశ మూడో తరం నట వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అన్నగారి శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అనే వార్తలు, కొన్ని వర్గాల నుంచి విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా రెస్పాండ్ అవ్వని ఎన్టీఆర్… ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళి అర్పించాడు. ఎప్పుడూ తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లే ఎన్టీఆర్,…
విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు తెలుగు వాడు ఉన్న ప్రతి చోటా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మే 31న అన్నగారి జయంతి నాడు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు ఆ యుగపురుషుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణలు నివాళి ఆరోపించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ తో పాటు కలిసి…
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా…
ఇప్పుడు తరచూ ‘పాన్ ఇండియా మూవీ’ అంటూ వినిపిస్తోంది. అసలు ‘పాన్ ఇండియా మూవీ’ అంటే ఏమిటి? భారతదేశమంతటా ఒకేసారి విడుదలయ్యే చిత్రాన్ని ‘పాన్ ఇండియా మూవీ’ అన్నది సినీపండిట్స్ మాట! కొందరు ఉత్తరాదిన హిందీలోనూ, దక్షిణాది నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సీమల్లో విడుదలయ్యే సినిమాలు అంటూ చెబుతున్నారు. ఇప్పుడంటే కన్నడ, మళయాళ సీమల్లోనూ సినిమాలకు క్రేజ్ ఉంది కానీ, ఒకప్పుడు దక్షిణాదిన సినిమా అంటే తెలుగు, తమిళ చిత్రాలే! ఉత్తరాదిన హిందీ,…