విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ…
నందమూరి బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది అంతటా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో, సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడంపై నాయకులు స్పందించారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన కొన్ని పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,…