విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు తెలుగు వాడు ఉన్న ప్రతి చోటా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మే 31న అన్నగారి జయంతి నాడు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు ఆ యుగపురుషుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణలు నివాళి ఆరోపించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ తో పాటు కలిసి ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళి అర్పించే కళ్యాణ్ రామ్… ఈరోజు ఎందుకో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లలేదు. సోషల్ మీడియాలో తారక రామారావు, బసవ తారకమ్మ ఉన్న ఫోటోని షేర్ చేసిన కళ్యాణ్ రామ్… “మీరే మా దైవం… మీరే మా సర్వం… తెలుగు జాతికి మీరు గర్వం… జోహార్ ఎన్టీఆర్” అంటూ ట్వీట్ చేసాడు.
Read Also: NTR Ghat: ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం.. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నివాళి
మీరే మా దైవం…
మీరే మా సర్వం…
తెలుగు జాతికి మీరు గర్వం.జోహార్ NTR. pic.twitter.com/06pGyRiv00
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 28, 2023