తాతకి తగ్గ మనవడిగా… నందమూరి వంశ మూడో తరం నట వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అన్నగారి శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అనే వార్తలు, కొన్ని వర్గాల నుంచి విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా రెస్పాండ్ అవ్వని ఎన్టీఆర్… ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళి అర్పించాడు. ఎప్పుడూ తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లే ఎన్టీఆర్, ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగా వెళ్లాడు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానుల సమక్షంలో తారక రామారావుకి నివాళి అర్పించాడు ఎన్టీఆర్. సోషల్ మీడియాలో కూడా “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఆ గుండెని మరొక్కసారి తాకిపో తాతా… సదా మీ ప్రేమకు బానిసను” అంటూ తాత ఫోటో పెట్టి ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ అభిమానులంతా జోహార్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Read Also: Dimple Hayathi: నో పోలీస్… బాలయ్య డైలాగ్ తో డింపుల్ హంగామా
మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/veKcoCWamx
— Jr NTR (@tarak9999) May 28, 2023