ఉత్తర కొరియా చీఫ్ కిమ్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అయిన సందర్భాలు ఎన్నో.. అయినా.. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిని కఠినంగా అమలు చేస్తారు.. ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటారు.. తాజాగా, విదేశీ సంస్కృతి అరికట్టాలన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఉత్తరకొరియా సర్కార్.. ముఖ్యంగా మహిళలపై ఈ ఆంక్షలు విధించింది.. 30 ఏళ్లలోపు మహిళల్ని టార్గెట్ చేసిన కిమ్… మహిళలు టైట్ జీన్స్ ధరించడం, జుట్టుకు రంగులు వేయడం, అసభ్యకర రాతలు రాసిఉన్నట్టువంటి బట్టలు ధరించడాన్ని…
అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు…ఇల్లూ తగలబెట్టుకోవచ్చు. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడివుంటుంది. అదేవిధంగా, సాంకేతిక ప్రగతి కూడా అంతే. స్మార్ట్ ఫోన్లను టెక్నాలజీకి ఉపయోగిస్తే మంచిది. అదే మోసాలకు ఉపయోగిస్తే సమాజానికి చేటు జరుగుతుంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకంలో మహిళలు ముందంజలో వున్నారంటే నమ్ముతారా? ఎస్ ముమ్మాటికి ఇది నిజమే. స్మార్ట ఫోన్ వాడకంలో ఓ రేంజ్ లో దూసుకు పోతున్నారు మన భారత దేశ మగువలు. ఇంటి పని, వంటపని ఏమో…
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు…
అమెరికాపై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రత విషయంలో రష్యా చట్టపరమైన డిమాండ్‌ను అమెరికా పట్టించుకోలేదని, అగ్రరాజ్యం సైనిక అధిపత్యాన్ని అనుసరించిందని ఉత్తర కొరియా పేర్కొన్నది. నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ లో పరిశోధకుడైన రి జి సాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర…
ఒక్క చిన్న వైరస్.. వందలాది దేశాలను వణికించింది. ఒకటి కాదు రెండేళ్ళకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారికి బలయిపోయారు. కరోనా వైరస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగిరావడంతో అనేక దేశాలు నిబంధనలు వదిలేశాయి. మనదేశంలో 25వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలక్రితం ఈ సంఖ్య రెండు లక్షలకు పైమాటే. కరోనా తగ్గిందని జనం బయట యథావిధిగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అంతేకాదు, కరోనా పరీక్షలను…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తరకొరియాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడనాడాలని నొక్కిచెప్పారు. రెండు దేశాల మధ్య జరిగిన సమావేశం అప్పట్లలో అర్థాంతరంగా ముగిసింది. ఆ తరువాత కూడా కిమ్‌తో ట్రంప్ టచ్‌లోనే ఉన్నారు. అణ్వాయుధాలను విడనాడే విధంగా చేసుందుకు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అంతలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మాజీ అయిపోయారు. Read: Ukraine…
ఉత్తర కొరియా చీఫ్ కిమ్ ఏ చేసినా సంచలనంగా మారుతుంది.. వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో ఉండే కిమ్.. ఎన్నో ఆంక్షలు పెట్టినా వెనక్కిమాత్రం తగ్గిన సందర్భాలు ఉండవు.. ఇప్పటికే అణ్వాయుధ క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యం అమెరాకుకు సైతం సవాల్ విసిరిన కిమ్.. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఓ స్టెప్ వెనక్కి వేసినట్టే కనిపించారు.. కానీ, మళ్లీ ఆ దేశం అణ్వాయుధ క్షిపణి పరీక్షా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి నిపుణులు ఒక తన…
దేశంలోని ప్రజల కోసం ఒకవైపు ఆహారాన్ని సమకూర్చుకుంటూనే, మరోవైపు క్షిపణీ ప్రయోగాలు చేస్తున్నది ఉత్తర కొరియా. 2022 జనవరిలో ఇప్పటి వరకు మొత్తం 7 క్షిపణీ ప్రయోగాలు చేపట్టింది. ఆదివారం ఉదయం సమయంలో ఉత్తర కొరియా భారీ క్షిపణిని ప్రయోగించి షాకిచ్చింది. ఇప్పటి వరకు స్వల్పశ్రేణి క్షిపణుల ప్రయోగాలు చేసిన ఉత్తర కొరియా 2017 తరువాత మరోసారి భారీ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి భూమినుంచి 2000 కిమీ ఎత్తుకు చేరుకొని అక్కడి నుంచి జపాన్ సముద్రంలో…
కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…