ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 80వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఉత్తర కొరియాలోని ఇంజియోన్ నగరంలో నిర్వహించారు. శీతాకాలం కావడంతో సంజియోన్ నగరంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నది. అత్యంత కఠిన హృదయుడైన కిమ్ జోంగ్ ఉన్ గడ్డగట్టే చలిలో ఆరుబయట తన తండ్రి విగ్రహం ముందు ఈ దాదాపు అరగంటసేపు వేడుకలను నిర్వహించారు.
Read: Youtuber Record: 42 సెకన్లలో రూ. 1.75 కోట్ల సంపాదన…
ఈ వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, నెత్తిమీద ఎలాంటి ఉన్న దుస్తులు లేకుండా చలిలో ప్రజలు అలాగే నిలబడిపోయారు. వేడుకలకు హాజరైన వారు అక్కడినుంచి కదిలిలే ఏమౌతుందో అందరికీ తెలుసు. చావడం కంటే కష్టపడి చలిని ఒర్చుకోవమే మేలు అని ప్రజలు వణుకుతూనే చలిలో నిలబడిపోయారు. అయితే, ప్రసంగించే గ్యాలరీ, అధికారులు కూర్చున్న ప్రాంతాల్లో పెద్దపెద్ద హీటర్లు పెట్టారు.