WHO Worry: నిబంధనలు గాలికి.. నిర్లక్ష్యం ఖరీదెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క చిన్న వైరస్.. వందలాది దేశాలను వణికించింది. ఒకటి కాదు రెండేళ్ళకు పైనే అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారికి బలయిపోయారు. కరోనా వైరస్ ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగిరావడంతో అనేక దేశాలు నిబంధనలు వదిలేశాయి. మనదేశంలో 25వేలకు లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. నెలక్రితం ఈ సంఖ్య రెండు లక్షలకు పైమాటే. కరోనా తగ్గిందని జనం బయట యథావిధిగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. అంతేకాదు, కరోనా పరీక్షలను తగ్గించేశాయి. అయితే, కరోనా విషయంలో అలసత్వం పనికిరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు పరీక్షలు చాలా కీలకమని, వాటిని తక్షణం కొనసాగించాలని కోరింది. కరోనా మన జీవితంలో భాగంగానే వుంటుందని, వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేయడం ఒక్కసారిగా పడిపోయాయి. ఒక వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించిందీ, లేనిదీ తెలుసుకునేందుకు కానీ, వైద్యం అందించాలన్నా పరీక్షలు తప్పనిసరి. పరీక్షల విషయంలో మనం చేసే నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు అంటున్నారు నిపుణులు. ఒమిక్రాన్ వేరియంటే చివరిది కాదని, మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఒమిక్రాన్ తర్వాత మరో వేరియంట్ కనుక వెలుగు చూస్తే అది మరింత శక్తమంతంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో జీరో కరోనా కేసులు వున్నాయని డబ్ల్యుహెచ్ వో జాబితా విడుదల చేసింది. దక్షిణ పసిఫిక్ మహాపముద్రంలోని టువాలు, టోకిలౌ, సెయింట్ హెలెనా, పిట్ కెయిర్స్ ఐల్యాండ్స్, నియూ, నౌరు, మైక్రోనేషియా, వనౌటు, మార్షల్ ఐల్యాండ్స్, కూక్ ఐల్యాండ్స్ లో కేసులు లేవు. కానీ కూక్ ఐల్యాండ్స్ లో తొలి కేసు నమోదైంది. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలు అక్కడకు వెళ్లడంతో కరోనా వ్యాపించిందని చెబుతున్నారు. వీటితో పాటు నార్త్ కొరియా, తుర్కమెనిస్తాన్‌లో సున్నా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేయడంతో అక్కడి కరోనా పరిస్థితి ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు.
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!