ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడ ఆయన చెప్పిందే శాసనం.. చేసిందే న్యాయం.. ఇప్పటివరకు కిమ్ చేసిన ఆగడాలు తలుచుకుంటే వెన్నులో వణుకుపుట్టక మానదు. అంతేకాదు అక్కడ ప్రజల బాధలను వింటే ఇక్కడ మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామో అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలకే మరణ శిక్ష విధించడం కిమ్ ప్రత్యేకత.. ఇటీవల కరోనా సమయంలో కరోనా వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చిమ్పించిన దురాగత నేత కిమ్. తాజాగా నెట్…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. గత కొన్ని నెలలుగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే మీడియాలో ఆయన కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నార్త్ కొరియా అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కిమ్ సన్నబడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ది నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ కీలక వివరాలను వెల్లడించింది. కిమ్…
కరోనా, అంతర్జాతీయ ఆంక్షలతో ఉత్తర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతున్నది. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల రక్షణ, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక, నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ…
ఉత్తర కొరియాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆకలి, పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస మానవహక్కుల ప్రత్యేక ప్రతినిధి క్వింటానా నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విరుచుకుపడ్డారు. క్వింటానా నివేదిక ద్వేషపూరితమైన అపవాదుగా ఉందని, తమ దేశంలోని వాస్తవ పరిస్థితులు, ప్రజల జీవన విధానం తెలియకుండా నివేదికలు తయారు చేస్తున్నారని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం తీసుకున్న స్వీయరక్షణ ఏర్పాట్లను పేర్కొన్నారని కిమ్ విమర్శించారు. తాము ఈ నివేదికను గుర్తించడం…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అణ్వాయుధ క్షిపణుల ప్రయోగాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మంగళవారం ఉదయం ఉత్తర కొరియా తూర్పుతీరంలో ఈ క్షిపణిని ప్రయోగించింది జపాన్‌కు షాక్ ఇచ్చింది. జపాన్ లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అంతర్జాతీయ ఆంక్షలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా కిమ్ అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. దక్షిణ కొరియా రాజధాని…
అమెరికా, ఉత్తర కొరియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర కొరియా విషయంలో కాస్త కటువుగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటే అణ్వస్త్రాలను పక్కనపెట్టాలని అప్పుడే ఆంక్షల విషయంపై ఆలోచిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర కొరియా మండిపడుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కిమ్ అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల…
అందరిదీ ఒకదారైతే, ఉత్తర కొరియా దేశానిది మరోక దారి. తమను విమర్శించిన వారికి వార్నింగ్‌లు ఇవ్వడం అన్నది వారికి కామన్. దక్షిణ కొరియా, అమెరికాపై ఒంటికాలిపై విరుచుకుపడే ఉత్తర కొరియా ఇప్పుడు ఏకంగా ఐరాసాను టార్గెట్ చేసింది. ఐరాసాపై విరుచుకుపడింది. ఇటీవలే నార్త్ కొరియా దేశం ఓ క్షిపణిని ప్రయోగించింది. సూపర్ సోనిక్ క్షిపణీ వ్యవస్థను సొంతం చేసుకోవడంతో వివిధ దేశాలు ఆందోళన చేస్తున్నాయి. నార్త్ కొరియాతో ఎప్పటికైనా డేంజర్ అని, వీలైనంత వరకు ఆ…
ఉత్తర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బయటకు వచ్చినా అది వెంటనే వైరల్ గా మారటం సహజమే. ఆ దేశంలో జరిగే విషయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాయి. గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని వార్తలు అధికంగా వచ్చే సమయంలో ఆయనకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రచురిస్తుంటుంది. అయితే, ఆయన ఆకారంలో వచ్చిన మార్పులను బట్టి కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఇక ఇదిలా…
వివాదాస్పద నిర్ణయాలు, ఎవరైతే నాకేంటి అంటూ ఇచ్చే ప్రకటనలు, వివాదాస్పద చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఉత్తర కొరియా నియంత కిమ్… తాజాగా, కొత్త తరహా హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది ఉత్తర కొరియా. హాసంగ్-8గా ఆ మిస్సైల్ను పిలుస్తున్నారు. అయిదేళ్ల సైనిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అయిదు కొత్త ఆయుధాలను తయారు చేశామని, దాంట్లో ఈ మిస్సైల్ కూడా ఒకటని నార్త్ కొరియా తెలిపింది. ఇదొక వ్యూహాత్మక ఆయుధమని ఆ దేశం చెబుతోంది. ఉత్తర కొరియా ఇచ్చిన…