నేపాల్, పాకిస్థాన్, ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు హడలెత్తించాయి. నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బీహార్‌లోని పాట్నాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదు. సింధుపాల్‌చోక్‌లో భూకంప కేంద్రం ఏర్పడింది. తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. హిమాలయ ప్రాంతం అంతటా ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. బీహార్‌లోని పాట్నా, ముజఫర్‌పూర్ సమీప ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లో కూడా భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: National Science Day 2025: నేడే ‘నేషనల్ సైన్స్ డే’.. ఎందుకు జరుపుకుంటారంటే!
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. భూకంప తీవ్రత 5.6 గా గుర్తించారు. భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం దీనిని 5.5 గా అంచనా వేసింది. అయితే బహుళ భూకంపాలు సంభవిస్తాయా? లేదా అనేది స్పష్టంగా తెలియచేయలేదు. అయితే భూప్రకంపనలకు ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లల్లోంచి జనాలు బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని నేపాలీ సీనియర్ అధికారి గణేష్ నేపాలీ మీడియాతో తెలిపారు.
ఇక పాట్నాలో భూకంపం కారణంగా సీలింగ్ ఫ్యాన్లు ఊగుతున్నట్లుగా కనిపించాయి. దాదాపు 35 సెకన్ల పాటు ఫ్యాన్ ఊగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 5.14 గంటలకు భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా గుర్తించారు
ఈ ఏడాది జనవరిలో టిబెట్‌లోని హిమాలయ ప్రాంతంలో ఆరు భూకంపాలు సంభవించాయి. అత్యంత శక్తివంతమైన 7.1 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో 125 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్య కాలంలో వరుస ప్రకంపనలు రావడంతో ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: AP Budget 2025-26: నేడు ఏపీ బడ్జెట్.. రూ.3.20 లక్షల కోట్ల అంచనాలతో..