తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి పెద్ద ఆరోపణ చేశారు. రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నారని.. దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతున్నదని అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారు ఇప్పుడు సైలెంట్‌గా మారారన్నారు. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మాన్ని వైరస్, డెంగ్యూ, మలేరియా పేర్లతో పిలిచారని గుర్తు చేశారు.
READ MORE: Tax Free Income: ఈ ఆదాయాలపై ఎటువంటి పన్ను ఉండదని తెలుసా..?
గవర్నర్ రవి ఏం చెప్పారు?
రాముడు ఉత్తర భారత దేవుడని, ఆయన ఇక్కడి (తమిళనాడు)కి చెందినవాడు కాదని కథనం సృష్టించారన్నారు. తమిళనాడు ప్రజలకు రాముడు తెలియదన్నారు. “శ్రీరాముడు ప్రతిచోటా ఉన్నాడు. తమిళనాడులో ఆయన పాదముద్రలు లేని ప్రదేశం లేదు. తమిళనాడు ప్రజలతో సహా ప్రతి వ్యక్తి హృదయాలలో, మనస్సులో ఆయన నివసిస్తున్నారు. కొందరి వల్ల యువత మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితి సామాజిక ఇంజనీరింగ్, సాంస్కృతిక మారణహోమం ద్వారా ప్రత్యేక గుర్తింపును సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దేశం మరియు గతం నుంచి మనల్ని ఏమీ ఉంచకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది. సనాతన ధర్మంపై ప్రజలు దాడి చేయడం ప్రారంభించారు. దానికి వైరస్, డెంగ్యూ, మలేరియా అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.” అని ఆయన తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.