భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా పట్టుబడింది. భారీగా గంజాయిని తరలిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుతో పాటు మరో కేసులో తల్లి కొడుకు కూడా పట్టుబడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో 8 ట్రాక్‌లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చిన ఘనత నిజామాబాద్‌కు ఉందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
Extremely Sad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మురికి కాల్వలో గల్లంతైన బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆనందనగర్‌లో బుధవారం సాయంత్రం డ్రైనేజీలో గల్లంతైన చిన్నారి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.
ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం వండుతున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా హాస్టళ్లలోని విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు.
Nizamabad Govt Hospital Boy Kidnap Update: నిజామాబాద్ జిల్లా కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కిడ్నాప్కు గురైన మూడేళ్ల బాలుడు అరుణ్ ఆచూకిని పోలీసులు కనుగొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. పోలీసులు బాలుడిని అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్ల నుంచి రక్షించిన పోలీసులకు అరుణ్ తండ్రి సాయినాథ్ ధన్యవాదాలు తెలిపాడు. కుమారుడు మళ్లీ తమ దగ్గరికి వస్తాడనుకోలేదని…
Nizamabad Crime: నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్,శైలజ (యువ జంట) ఆత్మహత్య కేసులో మృతురాలి పిన్నిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.