Extremely Sad: మురికికాలువలో రెండేళ్ల చిన్నారి.. 12 గంటల తరువాత మృతదేహం లభ్యం
- నిజామాబాద్ ఆనంద్ నగర్లో విషాదం..
- డ్రైనేజీ కాల్వలో గల్లంతైన మూడేళ్ల చిన్నారి అనన్య మృతి..
- సుమారు 12 గంటల తరువాత అనన్య మృతదేహం లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extremely Sad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మురికి కాల్వలో గల్లంతైన బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆనందనగర్‌లో బుధవారం సాయంత్రం డ్రైనేజీలో గల్లంతైన చిన్నారి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. చిన్నారి కనిపించకుండా పోయిన పన్నెండు గంటల తర్వాత మృతదేహాన్ని మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read also: Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసన..
Also Read
మహారాష్ట్రకు చెందిన దంపతులు గత కొంతకాలంగా నగరంలోని ఆనందనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త సేల్స్‌మెన్‌గా పనిచేస్తుండగా, భార్య క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి చిన్న కూతురు బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. కొంతసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. అమ్మమ్మ చెల్లెలు ఎక్కడుంటుందని ఆ చిన్నారి మనవడిని అడగ్గా.. మురుగు కాలువ వద్ద ఆడుకుంటోందని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా బాలిక కనిపించలేదు. అప్పుడు కాల్వలో మనవరాలు పడిపోయిందని పెద్దగా కేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. మున్సిపల్ కమిషనర్ మకరందు, అగ్నిమాపక స్టేషన్ అధికారి నర్సింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కాల్వలో చిన్నారి కోసం పొక్లెయినర్ సహాయంతో వెతికడం మొదలపెట్టారు. దాదాపు 12 గంటల తర్వాత ఎట్టకేలకు ఈ ఉదయం మున్సిపల్ సిబ్బంది అతికష్టమ్మీద చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
Mallu Bhatti Vikramarka: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు..
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?