నిజామాబాద్‌లో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. పులాంగ్ చౌరస్తా వద్ద కొత్త షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేసింది. మాల్ ఓపెనింగ్‌కు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్, స్థానిక రాజకీయ నేతలు పాల్గొన్నారు.
Read Also: Motorola G85: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్పై భారీ డిస్కౌంట్..!
సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో సినీ హీరో రామ్ పోతినేని, సినీ నటి పాయల్ రాజ్‌పుత్ కూడా పాల్గొన్నారు. ఈ మాల్ ప్రారంభోత్సవానికి జనాలు భారీగా తరలివచ్చారు. క్వాలిటీ డిజైన్లతో సీఎంఆర్ షాపింగ్ మాల్ అగ్రగామిగా నిలిచిందని హీరో రామ్ తెలిపారు. సీఎంఆర్ అంటే క్వాలిటీకి మారుపేరు అని హీరోయిన్ పాయల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో కలిపి తాజా మాల్ ఓపెనింగ్‌తో 35కి చేరింది. తెలంగాణలో నిజామాబాద్ స్టోర్‌తో కలిపి ఇది 12వది. పండుగల సీజన్ వస్తున్న క్రకమంలో.. ఈ మాల్ రాబోయే దసరా మరియు దీపావళి పండుగల సమయంలో హాట్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్‌గా మారనుంది.
Margani Bharat: చంద్రబాబు శ్రీవారి లడ్డూపై పెద్ద నింద వేశారు..
సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో చిన్న నుంచి పెద్దల వరకు వెరైటీలు లభించనున్నాయి. సాంప్రదాయ, ట్రెండింగ్‌లో వస్త్రాలు ఇక్కడ దొరుకుతాయి. ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతిని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో పొందొచ్చని, ప్రజలకు కావాల్సిన అన్ని రకాల బట్టలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.