NRI Koneru Shashank Joins BJP: తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయం మేమే అంటున్న భారతీయ జనతా పార్టీ.. ఆ దిశగా పావులు కదుపుతోంది.. ఇందులో భాగంగా.. ఇతర పార్టీలు చెందిన నేతలతో పాటు.. ఇతర ప్రముఖులకు కూడా కండువాకప్పుతోంది.. ఇక, తాజాగా ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బీజేపీలో చేరారు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షతులై ఎత్తుండా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్.. కమలం పార్టీలో చేరారు.. ఇక, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార కండవాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నా వంతుగా బీజేపీ కోసం అందరికీ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను సాయ సాకారంతో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఈసంర్భంగా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార.. బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడ్డుకుంట్ల శ్రీనివాస్, నస్రుల్లాబాద్ మండలం బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు, వర్నీ మండల అధ్యక్షులు శంకర్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ.. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..