Revanth Reddy: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన భారత్ జోడోయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాత్రి కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో భోజనాలు చేసి బస చేశారు. ఇవాళ ఉదయం అల్పాహారం తీసుకున్నానంతరం సరంపల్లి చౌరస్తా నుంచి సరంపల్లి, చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లి మీదుగా రాజంపేట చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు సరంపల్లి చౌరస్తాలో పాదయాత్ర ప్రారంభించి రాజంపేటలో నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకుని దేశాయి బ్రదర్స్ అతిథి గృహంలో సేదతీరనున్నారు.
Read also: PAN card-Aadhaar linking: ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది ?
ఇక సాయంత్రం 5 గంటలకు సిరిసిల్ల రోడ్ లోని దేశాయి బీడీ అతిథి గృహం నుంచి కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్రను నిజాంసాగర్ చౌరస్తా వరకు నిర్వహించనున్నారు. అనంతరం రాజంపేట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి పాదయాత్రను కామారెడ్డి జిల్లా కేంద్రంలో సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ తన అనుచరులతో కలిసి ఏర్పాట్లను చేస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నిన్న సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీకేజ్‌కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తున్నారని.. రాష్ట్రంలో 1.92 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతేడాది బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టం చేసినప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచడం చేయడం లేదని మండిపడ్డారు. వందలాది మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి, మోసం చేశారని ఆరోపించారు.
Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు