ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బహిరంగంగా ప్రశంసించారు. ఒక వైపు, కేజ్రీవాల్ నితిన్ గడ్కరీని మెచ్చుకుంటూ.. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వచ్ఛమైన సిద్ధాంతం గల నాయకుడని అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతిపరులని తరచూ చెప్పే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలను ఈ విధంగా పొగిడటం చాలా అరుదు.
Komatireddy Venkat Reddy : ఓఆర్‌ఆర్ అమ్ముకున్న వాళ్ళ పై విచారణ కి అదేశించామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం 7 వేల కోట్లకు అమ్మిందని ఆయన అన్నారు. హరీష్ రావు కి.. మామ మీదనో.. బామ్మర్ది మీదనో కోపం తోటి అసెంబ్లీ లో విచారణ కి డిమాండ్ చేశారన్నారు. సీఎం విచారణకు ఆదేశించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకి పోతారని,…
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల…
Nitin Gadkari: లివ్ ఇన్ రిలేషన్స్ తప్పు అని, ఇది సామాజిక నిబంధనలకు విరుద్ధమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వలింగ వివాహాలు సామాజిక నిర్మాణ పతనానికి దారి తీస్తాయని హెచ్చరించారు.
CM Revanth Reddy : రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో…
Nitin Gadkari: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Nitin Gadkari: తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తుండటంతో వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. తనతో పాటు కార్యక్రమంలో మరో కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే పాల్గొన్నారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్డీయే నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న గ్యారెంటీ లేదని.. కానీ రాందాస్ అథవాలే మంత్రి కావడం ఖాయమని గడ్కరీ అన్నారు.
Nitin Gadkari : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ పెద్ద విషయం చెప్పారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష అని అన్నారు.