కేంద్రం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎక్కడ లభిస్తుంది? ఈ వార్షిక పాస్ పొందేందుకు…
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్‌పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.
Nitin Gadkari: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో సీఎం చర్చలు చేపట్టారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలుపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి…
Nitin Gadkari: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం, బాగున్నారా..? అంటూ తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టిన ఆయన అనేక అభివృద్ధి అంశాలపై స్పందించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు సరిగా సాగడంలేదని గడ్కరీ పేర్కొన్నారు. ఈ పనుల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం కనుగొన్నామని, వేగంగా పూర్తి చేయడంకోసం కొత్త కాంట్రాక్టర్‌ను నియమించామని తెలిపారు. వచ్చే పది నెలల్లో ఫ్లై…
Kishan Reddy: కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది అన్నారు.
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల కల్పనకు ఒక విప్లవాత్మక ముందడుగు పడిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఉత్తరాద్య విధానాల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణ రాష్ట్రానికి వస్తారని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5,413…
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి కేంద్రం కృషి చేస్తున్నది. ఈ నిర్మాణం వెనుక ఉన్న ముఖ్యమైన అంశం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ. 2014 వరకు రాష్ట్రంలో…
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే…