బీజేపీలో కొన్నేళ్లుగా నరేంద్ర మోదీకి ఎదురులేకుండా పోతోంది. ఆయన ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగుతోంది. మోదీ ఇమేజ్ కారణంగానే బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోని వచ్చిందని ఆపార్టీ నేతలు భావిస్తుంటారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని, ప్రభుత్వంలోగానీ మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. ఒకవేళ ఎవరైనా మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల పదవి ఊడటమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేయడం వంటి సంఘటనలు కన్పిస్తుంటాయి. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక క్యాబినెట్లో…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. తన హయాంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు.. టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్ది వేచిచూసిన సందర్భాలకు చెక్ పెడుతూ.. ఫాస్ట్‌ట్యాగ్ లాంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.. అయితే.. త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలను చూస్తామని వెల్లడించారు గడ్కరీ.. ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్ (సీఐఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై టోల్ సేకరణ కోసం ప్లాజాలకు…
తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు…
తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు, జాతీయ రహదారుల గుర్తింపు చేయాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వినతి పత్రం అందించారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్య సభ ఎంపీల బృందం. అందులో… విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మించాలి. తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను గుర్తించాలని విన్నవించిన ఎంపీల బృందం… చౌటుప్పల్-షాద్ నగర్-కంది (RRR) – 186 KM…