కేంద్రం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎక్కడ లభిస్తుంది? ఈ వార్షిక పాస్ పొందేందుకు అర్హతలు ఏంటి? అని కొందరికి అనుమానం వచ్చే ఉంటుంది. ఈ వార్త పూర్తిగా చదివి వాటిని నివృత్తి చేసుకోండి..
READ MORE: TG Police: పాస్‌పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ భేష్.. టీజీ పోలీసుల శాఖకు జాతీయ స్థాయి గుర్తింపు..
ఎవరికి వర్తిస్తుంది.. ఎక్కడ లభిస్తుంది..?
ఈ వార్షిక పాస్ వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకు మాత్రమే. అంటే.. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వాహనాలకు ఇప్పటికే ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండాలి. వాహన విండ్‌షీల్డ్‌పై అతికించి ఉండాలి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరంతరాయంగా, చౌకగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పాస్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాజ్ మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (MORDH) వెబ్సైట్ ల లో అందుబాటులో ఉంటుంది.
READ MORE: CM Revanth Reddy: రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు.. సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం ఆదేశాలు..