ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి గతి శక్తి వల్ల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని, ఈ బడ్జెట్ చారిత్రాత్మకం అన్నారు సీఐఐ ఛైర్మన్ తిరుపతి రాజు. రోడ్ల నిర్మాణం ప్రణాళిక హర్షించదగింది. నదుల అనుసంధానం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్హి, వనరుల వినియోగానికి బాగా ఉపకరిస్తుందన్నారు. మెజార్టీ వాటా గతి శక్తికి కేటాయించడం చాలా ప్రయోజనకరం. స్కూళ్ల డిజిటలైజేషన్ విద్యావ్యవస్థలో మార్పుకి అవకాశం కల్పించింది. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు, పరిశ్రమలతో అనుసంధానం…
ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మంగళవారం ప్రతిపక్ష పార్టీలకు “ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి అభిప్రాయాలు లేవని” అన్నారు. “ఆర్థిక సర్వే తర్వాత భారతదేశంలో ప్రతిపక్షం లేదని మీరు నిర్ధారణకు వస్తారు మరియు బలహీనమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ, దానికి ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి అభిప్రాయాలు లేవు” అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉభయ సభల్లో…
ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు…
తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలంటూ మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900…
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో…
ప్రధాని మోడీతో సమావేశ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు జరిపారు. ఈమేరకు విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జగన్ అందించారు. ప్రత్యేక హోదా అంశం, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం జగన్. ఇవే కాకుండా…
కేంద్ర మంత్రులు నిర్మలాసీతారమన్, మహేంద్రనాథ్‌లకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేక రాశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను కేంద్రం పునఃప్రారంభించాలని కోరుతూ కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీసీఐ యూనిట్ తెరిచేందుకు సానుకూల అంశాలున్నాయని ఆయన అన్నారు. దేశీయంగా సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉందని, ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు లాభాలు అర్జిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే సీసీఐ తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకు ఇచ్చే ప్రోత్సహకాలు,…
బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీయే ఉంటుంది.. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ) ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు… ప్రభుత్త గణాంకాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ నాటికి దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్..…
ప్రతి ఏడాది అత్యంత శక్తివంతమైన జాబితాలో చోటు దక్కించుకనే మహిళలు, ప్రముఖులు ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఎక్కడం సర్వ సాధారణం. కానీ ఇందులో పేరు ఎక్కాలంటే ఎంతో శ్రమతో పాటు పేరు, ప్రతిష్టలు సంపాదించాలి. ప్రపపంచ వ్యాప్తంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అంతలా వడబోసి మరీ వెతుకుతుంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ . వారు చేస్తున్న సేవలు, ఉన్న స్థానం, ప్రస్తుతం తీసుకునే నిర్ణయాల ఆధారంగా పోర్బ్స్‌లో చోటు దక్కించుకోవడానికి…
శీతాకాల పార్లమెంటు సమావేశాలు గత నెల 29 ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనల నడుమ నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. అయితే లోక్‌సభ 6వ రోజు సమావేశాలు ప్రారంభం నుంచే విపక్షాలు నాగాలాండ్ ఘటనపై చర్చించాలంటూ ఆందోళనకు దిగాయి. దీంతో మరోసారి లోకసభ వేడెక్కింది. విపక్షాల నినాదాలకు స్పందిస్తూ నాగాలాండ్ ఘటనపై హోంమత్రి ప్రకటన చేస్తారని కేంద్రం వెల్లడించింది. నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 17 చేరింది. ఇదిలా ఉంటే…