కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్ మెంట్…
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్… రష్యా – ఉక్రెయిన్ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు కొరత ఏర్పడిందని.. ఆవనూనె దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యింది. మిగిలిన 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్లో వున్నారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్‌తో మోదీ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య…
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. గత ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలను కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు, ఎన్నికలకు సంబంధం లేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలని.. కరోనా కారణంగా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు చేనేత కళాకారులను గుర్తించి…
భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈరోజు కలిశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఉన్న ప్రజలు లబ్ధిని పొందలేక పోతున్నారని వివరించారు. కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం…
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య పూర్తి సామరస్యం, సరైన అవగాహన ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ సహా అన్ని అంశాలపై కేంద్రం, RBI ఒకే మాటపై ఉన్నాయని చెప్పారు. ఒక వ్యవస్థ పట్ల మరో వ్యవస్థకు పరస్పర నమ్మకముందన్నారు నిర్మల. జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తో కలసి మీడియా ముందుకొచ్చిన నిర్మల… ప్రతీ విషయంలోనూ……
కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తూ.. రాజ్యసభలో వైసీపీ పాలనపై విమర్శలు చేశారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2014-15లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అన్నారు జీవీఎల్. 2020-21లో, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.77,538 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందిందని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై…
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన హామీలు ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు.ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, మెట్రోరైలు వంటివి ప్రస్తావనే లేదన్నారు సీపీఎం నేతలు. కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ నేతలు నిరసన తెలిపారు. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం చెందారు. విశాఖ సీపీఐ కార్యాలయం నుంచి…