టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫోటోల ఫ్లెక్సీల యుద్ధం ఈ నాటిది కాదు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది.. సోషల్ మీడియాలోనూ.. పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. ఇప్పుడు.. మరోసారి అలాంటి యుద్ధానికి తెరలేపారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్… శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీర్కూరు మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని తనిఖీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు..…
Mobikwik: మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ మొత్తం ఆదాయం 80 శాతం పెరిగి 540 కోట్లకు చేరినట్లు ఫిన్‌టెక్ కంపెనీ మొబీక్విక్ వెల్లడించింది. ఇందులో 300 కోట్లకు పైగా ఆదాయం 2020-21లోనే సమకూరినట్లు స్పష్టం చేసింది. ఆ సంవత్సరం 30 కోట్లు మాత్రమే కంట్రిబ్యూషన్ మార్జిన్ రాగా అది ఇప్పుడు రూ.145 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
Satyavathi Rathod criticized union minister Kishan Reddy: కేంద్రమంత్రి ఒక పార్లమెంట్ కే పరిమితమై పనిచేయడం సిగ్గు చేటని.. నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీకి తెలంగాణలో చోటు లేదని.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడో స్థానమే అని ఆమె అన్నారు. తెలంగాణలో బీహార్ కూలీలు 30 లక్షల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు.
Harish Rao challenges Nirmala Sitharaman: రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారు.ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రిహరీష్ రావ్ మండిపడ్డారు. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని మండిపడ్డారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని గుర్తు చేశారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ అని స్పష్టం చేశారు.…
నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుడిపై భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లు పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. దీంతో పేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వచ్చే వారం నుంచి మరిన్ని నిత్యావసరాల ధరలు పెరుగనున్నట్లు తెలిసింది. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో జూలై 18 తరువాత నుంచి పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. దీంతో మరింతగా సామాన్యుడిపై భారం పడబోతోంది.…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్ మెంట్…
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్… రష్యా – ఉక్రెయిన్ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు కొరత ఏర్పడిందని.. ఆవనూనె దిగుమతులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యింది. మిగిలిన 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి…