Economic Survey 2023 Highlights: ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే-2023ను ప్రవేశపెట్టారు. ఈ సర్వే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టింది. వివిధ రంగాల గణాంకాలను సవివరంగా పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా సెక్టార్ల పనితీరును ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల గురించి, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి స్పష్టంగా పేర్కొంది.
పార్లమెంట్లో ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని.. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు.
ఆర్థిక మాంద్యం, ఎన్నికలు, ఆర్థిక క్రమశిక్షణ, జనాకర్షణ అనేక సవాళ్ల మధ్య కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా రేటును 6.8 శాతానికి తీసుకెళ్లడానికి పునాది వేయనుంది. 2019 తర్వాత ఐదో సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
Ujjwala Yojana: గృహ గ్యాస్ సిలిండర్ ధరలు వెయ్యి రూపాయలకు పైగా పెరిగాయి. నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్కు మంత్రి హరీష్రావు లేఖ. ఏపీ బదలాయించిన రూ.495 కోట్ల సీఎస్ఎస్ నిధులు తిరిగి ఇప్పించాలని లేఖ. ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదని.. ఇప్పటికైనా స్పందించి సీఎస్ఎస్ నిధులు తెలంగాణకు తిరిగి ఇప్పంచాలని హరీష్రావు పేర్కొన్నారు.