Tammineni Veerabhadram: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అసహనం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పేదరికాన్ని రూపుమాపేదిగా లేదని, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో దారిద్య్రం లేకుండా చేస్తామని, పేదలు లేని భారత్‌ను ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఘనంగా ప్రకటించిన నిర్మలమ్మ.. ఈ బడ్జెట్‌లో దారిద్య్ర నిర్మూలనకు ఉపయోగపడే పథకాలతో పాటు ఉత్పత్తి రంగానికి దోహదపడే కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఇది తిరోగమన ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ అని ధ్వజమెత్తారు.
Harish Rao: కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది.. బడ్జెట్‌లో వాటికి రూపాయి ఇవ్వలేదు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాను గణనీయంగా తగ్గించారని తమ్మినేని మండిపడ్డారు. గత సంవత్సరం రాష్ట్రాల నుండి వచ్చే పన్నుల్లో కేంద్రం 42శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని 41 శాతానికి తగ్గించిందన్నారు. తెలంగాణకు కేవలం 2.133 శాతం మాత్రమే తిరిగి వస్తోందని.. అది కూడా సకాలంలో కేంద్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన ప్రకృతి వైపరీత్యాల పరిహారం, స్థానిక సంస్థల నిధులు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులు, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర రంగాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో రాష్ట్రానికి కోత పెట్టారన్నారు. రాష్ట్రంలో సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలని కోరినా.. కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. పైగా.. రాష్ట్ర నదులపై కేంద్రం బోర్డులు వేసి, తన అధీనంలోకి తీసుకుందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణాలు ఆగిపోయాయని, మంజూరు చేసిన రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు తగ్గిందని, దశాబ్దాల తరబడి మంజూరైన కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం కక్ష్యపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో స్పష్టమైందన్నారు.
Cycling: సైక్లింగ్‌తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?
ఈ బడ్జెట్‌లో రూ.10,79,971 కోట్లు వడ్డీలకిందనే చెల్లిస్తున్నారని.. స్వదేశీ, విదేశీ అప్పులు కలిసి రు.137లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎకనమిక్ సర్వే తెలుపుతోందని తమ్మనేని పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల దేశ స్థూల ఉత్పత్తిని సాధిస్తామని ప్రధాని మోడీ ఎన్నోసార్లు ప్రకటించారని.. మరి, రానున్న రెండేళ్ళలో రెట్టింపు స్థూల ఉత్పత్తి పెరుగుతుందా? అని ప్రశ్నించారు. ఈ యేడాది దేశ వృద్ధిరేటు 7 శాతం ఉన్నట్టు చెపుతూనే.. 2023-24లో 6.5 శాతానికి తగ్గుతుందని ఆర్థికమంత్రి చెప్పారని.. ఇలాంటి స్థితిలో దేశాభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది? నిలదీశారు. 2022-23లో ఉపాధిహామి పథకానికి 89,400 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో 60,000 కోట్లకే పరిమితం చేశారన్నారు. ఆహార సబ్సిడీని గత సంవత్సరంపై 50శాతం తగ్గించారని, గ్యాస్‌పై సబ్సిడీని కూడా తగ్గించారన్నారు. ఆకలి సూచికలో 140వ స్థానం, విద్యలో 33వ స్థానం, ఆరోగ్యంలో 66వ స్థానం ఉన్న దేశం.. అభివృద్ధి కావడానికి ప్రస్తుత బడ్జెట్ సహకరిస్తుందా? అని ప్రశ్నించారు.